ఖండ్వా: మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు రక్తదానం చేసి తిరిగి బైక్‌పై సొంతూరు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వీరు వెళుతున్న బైక్‌ను ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. చిక్తిఖల్ గ్రామానికి చెందిన అజయ్ సింగ్ తోమర్ ఖండ్వాలో బ్లడ్ డొనేట్ చేసి తన స్నేహితుడు దీపక్ గుర్జర్‌తో కలిసి బైక్‌పై తిరిగి సొంతూరు వస్తున్నాడు.
ఈ సమయంలో బంగ్రాడా గ్రామంలోని బస్టాప్ వద్దకు వీళ్ల బైక్ రాగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్(MP 12 AC 9381) ఢీ కొట్టింది. ఈ ఘటనలో దీపక్ స్పాట్లోనే చనిపోయాడు. అజయ్ సింగ్ తీవ్ర గాయాల పాలయ్యాడు.
అతనిని ఇండోర్‌కు చికిత్స నిమిత్తం తరలించగా.. మెరుగైన చికిత్స కోసం అతనిని భోపాల్‌కు తరలించాలని చెప్పడంతో భోపాల్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అజయ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన దీపక్, అజయ్ కుటుంబాల్లో పెను విషాదం నింపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bike accident, Crime news, Road accident