మైనర్లు కాదు కీచకులు...యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి...

నిందితులు ఇరువురితో పరిచయం ఉన్న స్నేహితురాలి ద్వారా బాధిత యువతి వీరికి పరిచయం అయ్యింది. అప్పటి నుంచే యువతిపై వీరు కన్నేశారు. అయితే వయస్సులో చిన్నవారు కావడంతో ఆమె వారిని పెద్దగా అనుమానించలేదు. అయితే ఎలాగైనా ఆమెపై లైంగిక దాడికి పాల్పడాలని డిసైడయ్యారు.

news18-telugu
Updated: July 14, 2019, 8:49 PM IST
మైనర్లు కాదు కీచకులు...యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తున్న యువతిని ఇద్దరు మైనర్ యువకులు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, లైంగిక దాడికి పాల్పడిన ఘటన మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బాధిత యువతి(20) స్థానికంగా ఉన్న క్లాత్ షోరూంలో పనిచేస్తుండగా, నిందితులు ఒక బాలుడు (18) కాలేజీలో చదువుతుండగా, మరో బాలుడు (18) చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. కాగా నిందితులు ఇరువురితో పరిచయం ఉన్న స్నేహితురాలి ద్వారా బాధిత యువతి వీరికి పరిచయం అయ్యింది. అప్పటి నుంచే యువతిపై వీరు కన్నేశారు. అయితే వయస్సులో చిన్నవారు కావడంతో ఆమె వారిని పెద్దగా అనుమానించలేదు. అయితే ఎలాగైనా ఆమెపై లైంగిక దాడికి పాల్పడాలని డిసైడయ్యారు. తమ కుటిల ప్రయత్నంలో భాగంగా శుక్రవారం షోరూంలో విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న యువతిని అడ్డగించి, తమ స్నేహితురాలు ఒక ప్రదేశంలో ఎదురు చూస్తోందని, టూవీలర్ పై అక్కడకు వెళదామని చెప్పగా, అందుకు ఆ యువతి బండిపై కూర్చుంది. అనంతరం నిందితులు ఆమెను దమ్మాయిగూడకు తీసుకెళ్లారు.

అక్కడే ఒక నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడే ప్రయత్నం చేశారు. అయితే ఆమె వారిని ప్రతిఘటించి అక్కడి నుంచి తప్పించుకొని జవహర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. అనంతరం బాధితురాలిని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ తరలించగా, అక్కడే నిందితులపై కేసు నమోదు చేసారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు.

First published: July 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>