హోమ్ /వార్తలు /క్రైమ్ /

Two Girls Love Story: ఇద్దరమ్మాయిలు..! ఒక ప్రేమకథ..!! కర్నూలులో సంచలనం

Two Girls Love Story: ఇద్దరమ్మాయిలు..! ఒక ప్రేమకథ..!! కర్నూలులో సంచలనం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమ్మాయి.. అబ్బాయి ప్రేమించుకుంటే.. పెద్దవాళ్లకు నచ్చితే పెళ్లి చేస్తారు. లేదంటే విడదీస్తారు. మరీ క్రూరులైతే ఆ జంటలను హతమార్చుతారు. కానీ అమ్మాయి.. అమ్మాయినే ప్రేమిస్తే.. వాళ్లిద్దరూ ఈ సభ్య సమాజం నుంచి దూరంగా వెళ్లిపోతే...?

 • News18
 • Last Updated :

  కలికాలం అంటే ఇదేనేమో...! అదేంటి ఇది చలికాలం కదా అంటూ జబర్దస్త్ పంచ్ లు వేయకండి. సమాజంలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. ఈ మధ్య కొన్ని ఘటనలు సృష్టికి విరుద్ధంగా జరుగుతున్నాయి. ఇవి విధి వైపరీత్యాలో లేక మరేంటో గానీ.. ఇలాంటివి చూసినప్పుడల్లా ఎలా రియాక్టవ్వాలో తెలియక జనాలు తలలు పట్టుకుంటున్నారు. ఒకప్పుడు గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ వ్యవహారాలు సోషల్ మీడియా యుగంలో మాత్రం దాగడం లేదు. అమ్మాయి.. అబ్బాయి ప్రేమించుకోవడంలో ఒక అర్థం ఉంది. కానీ అమ్మాయి.. మరో అమ్మాయి ప్రేమించుకుంటే..? వారిద్దరూ ఈ సభ్య సమాజం నుంచి దూరంగా పారిపోవాలనుకుంటే.? అది ఖచ్చితంగా ‘ఇద్దరమ్మాయిల’ కథే.

  ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువతుల ప్రేమాయణం కర్నూలు తో పాటు యావత్ తెలుగు రాష్ట్రాలను అయోమయానికి గురిచేస్తోంది. వివరాల్లోకెళ్తే.. కర్నూలు లోని సంతోష్ నగర్‌కు చెందిన యువతి (21), నర్సింహ రెడ్డి నగర్‌కు చెందిన మరో యువతి (20) ఇంట్లో నుండి పరారయ్యారు. వీరిరువురు పెద్దవాళ్లు తమ ప్రేమను ఒప్పుకోనందుకు ఇంటి నుంచి వెళ్లిపోయారు.

  ఆ ఇద్దరు యువతులు చిన్ననాటి నుంచి స్నేహితులు. ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నారు. ఇంతలో నర్సింహరెడ్డి యవతిని ఇంట్లో వాళ్లు చదువు మాన్పించారు. ఇటీవలే ఆమెకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారని తెలిసింది. అది ఆ యువతికి నచ్చలేదు. చిన్ననాటి నుంచి కలిసి తిరిగిన తన మిత్రురాలితోనే జీవితం గడపాలనుకుంది. చిన్నప్పటి నుంచే స్నేహం ఉన్న వారి మధ్య.. అది కాస్తా ప్రేమ బంధంగా మారింది. దీంతో ఇద్దరు కలిసి బుధవారం ఇరువురి తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయారు.

  దీంతో ఇరువురి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రెండో పట్టణ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఆ యువతులను త్వరలోనే పట్టుకుంటామని.. వారిని విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Kurnool, Love, Love affair

  ఉత్తమ కథలు