ప్రాణం తీసిన ప్రేమ... ఒకే వ్యక్తిని ప్రేమించి... వదినా మరదళ్ల ఆత్మహత్య...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల లక్ష్మీకాలనీకి చెందిన ఇద్దరు యువతుల ఆత్మహత్య... పురుగుల మందు తాగి బలవన్మరణం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 2, 2019, 10:32 PM IST
ప్రాణం తీసిన ప్రేమ... ఒకే వ్యక్తిని ప్రేమించి... వదినా మరదళ్ల ఆత్మహత్య...
నమూనా చిత్రం
  • Share this:
వాళ్లు వదినా మరదళ్లు. కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వారికి ఓ వ్యక్తితో పరిచయమైంది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ ఒక్కరినే ప్రేమించారు. వరుసకు వదినా మరదళ్లు కూడా కావడంతో ఒకరిని పెళ్లి చేసుకుంటే, మరొకరికి వరుసకు అన్న అవుతాడా వ్యక్తి. దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇద్దరూ కలిసి ప్రాణాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం క్రియేట్ చేసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల లక్ష్మీకాలనీకి చెందిన సంగీత, జానకి... ఎప్పటిలాగే బుధవారం కూడా కూలీ పనులకు వెళ్లారు. అయితే సాయంత్రం ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదు. దంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు... ఇద్దరి కోసం గాలించారు. చర్ల గోదావరి ఒడ్డున ఇద్దరు వదినామరదళ్లు అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గుర్తించి... వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొదుతూ ఇద్దరూ చనిపోయారు. ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో దొరికిన సూసైడ్ నోట్ దొరకడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... ఇద్దరి ఆత్మహత్యకు ఆ వ్యక్తికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి...

కొండ ఎక్కబోయి... జారి కిందపడి జెఎన్‌యూ విద్యార్థి మృతి... వీడియో వైరల్...
పైఅంతస్థులో ఉంటూ... రహస్యంగా యువతి బాత్రూమ్‌ వీడియోలు...


‘పాత ఎటిఎం కార్డు పనిచేయదు... కొత్తవి ఇస్తాం...’ లక్షలు కాజేస్తున్న కేటుగాళ్లు...


మొబైల్‌ఫోన్ కారులోనే పెట్టి వెళ్తున్నారా... తస్మాత్ జాగ్రత్త...

పర్సు కొట్టేశారు కానీ... బండిలో పెట్రోల్ కొట్టించడం మరిచిపోయారు...


భార్యతో మాట్లాడాడని... పిల్లల డాక్టర్‌ను చితకబాదాడు...


టీనేజ్ వయసులోనే ఆంటీతో లైంగిక సంబంధం... ఆంధ్రా కుర్రాడి హత్య...


‘నా ఛాతిపై ముద్దు పెట్టబోయాడు...’ - నన్‌లపై పెరుగుతున్న ప్రిస్ట్‌ల అఘాయిత్యాలు...


ఆశ్రయం కోసం వచ్చిన భక్తురాలిపై ఆశ్రమంలోనే అత్యాచారం...


‘మిస్డ్ కాల్స్‌’తో భారీ మోసం... రెండు కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు...


న్యూఇయర్ పార్టీకి డబ్బుల్లేవని... ఎటిఎం ఎత్తేయబోయాడు...

First published: January 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు