హోమ్ /వార్తలు /క్రైమ్ /

Sad: ఒకరికి పెళ్లయి రెండు నెలలు.. మరొకరికి త్వరలో పెళ్లి.. ఇంతలోనే ఇద్దరి జీవితాలు ఇలా..

Sad: ఒకరికి పెళ్లయి రెండు నెలలు.. మరొకరికి త్వరలో పెళ్లి.. ఇంతలోనే ఇద్దరి జీవితాలు ఇలా..

అనితా కుమారి, సుబి జోసెఫ్

అనితా కుమారి, సుబి జోసెఫ్

రెండు నెలల క్రితమే ఆ యువతికి వివాహమైంది. వైవాహిక జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమెను విధి వంచించింది. ఆమె నూరేళ్ల జీవితాన్ని రోడ్డు ప్రమాదంలో రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన బీహార్‌లోని మైన్‌పుర పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనితా కుమారి అనే యువతి కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది.

ఇంకా చదవండి ...

పాట్నా, కొట్టాయం: రెండు నెలల క్రితమే ఆ యువతికి వివాహమైంది. వైవాహిక జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమెను విధి వంచించింది. ఆమె నూరేళ్ల జీవితాన్ని రోడ్డు ప్రమాదంలో రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన బీహార్‌లోని మైన్‌పుర పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనితా కుమారి అనే యువతి కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమెకు రెండు నెలల క్రితం వివాహమైంది. మార్నింగ్ వాక్‌కు ఆమె వెళుతుండగా స్కార్పియో ఆమెను ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఇదిలా ఉండగా.. ఘటన జరిగిన వెంటనే స్కార్పియో డ్రైవర్ భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వెహికల్ నంబర్‌ను గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కేరళలో కూడా ఈ తరహా రోడ్డు ప్రమాదమే వెలుగుచూసింది.

కొట్టాయం జిల్లాకు చెందిన సుబి జోసెఫ్ అనే 25 ఏళ్ల యువతి తన కాబోయే భర్తతో కలిసి మంగళవారం సాయంత్రం బైక్‌పై వెళుతుండగా మృత్యువు ఆమెను యాక్సిడెంట్ రూపంలో కబళించింది. కేరళ ఆర్టీసీకి చెందిన బస్సు వీళ్లు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. మంగళవారం సాయంత్రం 5.30 సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న సుబి కిందపడిపోగా.. ఆమె తలపై నుంచి బస్సు ముందు చక్రాలు వెళ్లడంతో స్పాట్‌లోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో బైక్ డ్రైవ్ చేస్తున్న సుబి కాబోయే భర్త పక్కకు పడిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. బైక్‌ను బస్సు ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. సుబి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాబోయే వాడితో కలిసి అప్పటివరకూ సంతోషంగా గడిపిన సుబి మరణం ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది.

ఇది కూడా చదవండి: Husband: ఇతనో సెక్యూరిటీ గార్డు.. 11 రోజుల క్రితమే కొడుకు పుట్టాడు.. కానీ ఇలా చేశాడంటే బాధేస్తోంది..

మరికొద్ది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. ఇంతలోనే కూతురి అకాల మరణం ఆమె తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగిల్చింది. ఆమె తల్లి ఏడ్చిన తీరు చూపరులను కలచివేసింది. ఇలా రెండు ప్రమాదాలు ఇద్దరు యువతుల నిండు జీవితాలను బలి తీసుకున్నాయి. ఒకరికి పెళ్లయి రెండు నెలలు మాత్రమే కాగా.. మరొకరు పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టాల్సిన యువతి కావడం గమనార్హం. ఈ ఇద్దరి మరణం వారి కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టేసింది.

First published:

Tags: Bike accident, Crime news, Newly Couple, Road accident

ఉత్తమ కథలు