Telangana Crime: బొమ్మ బొరుసు ఆట ఆడదామని పిలిచి.. గుట్టపైకి తీసుకెళ్లి.. బండరాయితో కొట్టి చంపేశారు.. అసలేమైందంటే..

నిందితులను చూపుతున్న పోలీసులు

Telangana Crime: బొమ్మ బొరుసు ఆటలో రూ.28 వేలు ఆ ఇద్దరు యువకులు పోగొట్టుకున్నారు. డబ్బులు గెలుచున్న ఆ వ్యక్తిని ఎలాగైనా చంపేయాలని పథకం వేశారు. అనుకున్నట్లుగానే ఆట ఆడదాం రమ్మని పిలిచి తలపై గట్టిగా రాయితో మోది చంపేశారు. ఈ ఘటన మెదక్ లో చోటుచేసుకుంది.

 • Share this:
  (కె. వీరన్న, మెదక్ జిల్లా , న్యూస్18 తెలుగు) 

  మెదక్ జిల్లా పాపన్న పేట మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు రోజూ పేకాట ఆడుతుండేవారు. పేకాటకు అలవాటు పడి జల్సాగా తిరిగేవారు. ఇందులో ఓ వ్యక్తికి రూ.28వేలు వచ్చాయి. డబ్బులు పోయినందుకు వాళ్లిద్దరు జీర్ణించుకోలేక పోయారు. అతడి వద్ద నుంచి ఎలాగైనా ఆ డబ్బులను కొట్టెయాలనే ఆలోచన మిగిలిన ఇద్దరికి పడింది. ఆ యువకుడికి ఫోన్ చేసి పేకాట తో పాటు బొమ్మ బరుసు ఆడదామని అతడికి ఫోన్ చేశారు. ఆ ఇద్దరు యువకులు కలిసి పథకం ప్రకారం ఆ యువకుడిని పేకాట ఆడుదామని గ్రమ శివారులోని గుట్టపైకి పిలిచారు. పథకం ప్రకారం అతడిని చంపేసి ఆ డబ్బులను తీసుకొని పారిపోయారు. ఈ ఘటన జూన్ 24 న జరగ్గా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నేడు ఉదయం నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఇలా తెలిపారు.

  మెదక్ జిల్లా పాపన్నపేట మండలం దౌలాపూర్ గ్రామ శివారులో ముగ్గురు స్నేహితులు రోజూ బొమ్మ బొరుసు, పేకాట ఆడేవారు. అందులో శివ కుమార్ అనే యువకుడికి బొమ్మ బొరుసు ఆటలో ఒకే రోజు రూ. 28,000 రావడంతో మిగతా ఇద్దరికీ శివ కుమార్ కు వచ్చిన డబ్బులు చూసి జీర్ణించుకోలేకపోయారు. శివ కుమార్ నుండి ఎలాగైనా సరే ఇరవై ఎనిమిది వేల రూపాయలు తీసుకోవాలని చాకలి కృష్ణ , మల్లేశం పథకం వేశారు. రోజులాగే శివ కుమార్ కు బొమ్మ బొరుసు ఆట ఆడదామని ఓ రోజు పిలిచారు. శివ కుమార్ కు వచ్చిన డబ్బులు తీసుకొని దౌలాపూర్ గ్రామం గుట్టమీదికి రమ్మన్నారు. శివ కుమార్ ఆ డబ్బులు తీసుకొని బుట్ట గుట్ట మీదికి వెళ్లాడు.

  శివకుమార్ అక్కడికి వెళ్లగానే చాకలి కృష్ణ శివ కుమార్ మెడకు టవల్ తో గట్టిగా చుట్టగా.. మల్లేశం బండరాయితో కొట్టాడు. దీంతో శివకుమార్ అక్కడికి అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ డబ్బులు తీసుకొని చాకలి కృష్ణ, మల్లేశంలు తీసుకొని పారిపోయారు. జూన్ 24వ తేదీన సాయంత్రం గొర్ల కాపరి గుట్టమీదికి వెళ్లగా అక్కడ దారుణ హత్య గురైన శివ కుమార్ ను చూసి గ్రామస్తులకు చెప్పడంతో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హత్యకు గురయినట్లు నిర్దారించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు నిందితులను శుక్రవారం ఉదయం పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.
  Published by:Veera Babu
  First published: