కామారెడ్డిలో విషాదం.. గేదెలు మేపేందుకు వెళ్లి చెరువులో పడి ఇద్దరు మృతి

గేదెలను మేపేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు చెరువు నీటిలో పడి మృతిచెందారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెరువులోంచి మృతదేహాలను బయటకు తీశారు.

news18-telugu
Updated: March 26, 2020, 5:50 PM IST
కామారెడ్డిలో విషాదం.. గేదెలు మేపేందుకు వెళ్లి చెరువులో పడి ఇద్దరు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. గేదెలు మేపేందుకు వెళ్లి చెరువులో పడి ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియల్ గ్రామంలో చోటుచేసుకుంది. చేతికందివచ్చిన కొడుకులు చెరువులో పడి మృతిచెందడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతు లేకుండాపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మద్దికుంట శేఖర్, రణదీప్‌లు రోజులాగే గేదెలను మేపేందుకు వెళ్లారు. మేత తిన్న తర్వాత గేదెలు నీరు తాగేందుకు చెరువులోకి దిగాయి. నీటిలో నుంచి గేదెలు ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో దస్తులు విప్పి ఇద్దరు యువకులు చెరువులోకి దిగారు.

నీటిలో చెరువులో ఉన్న గుంత కన్పించక అందులో పడిపోయారు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు చెరువులో గాలించి ఇద్దరు మృతదేహాలను బయటకు తీశారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు