సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరులో విషాదం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురికి విద్యుత్ షాక్ తగిలింది. ఈ షాక్‌తో.. తండ్రి తోపాటు రెండు సంవత్సరాల కూతురు చనిపోయింది. మరోవైపు తల్లి పిరిస్థితి విషమంగా ఉంది.. కాగా తమ ఇంటిపక్కనే ఉన్న విద్యుత్ వైర్లకు బాల్కాని ఉన్న ఐరన్ పైప్ తగలడంతో ఇళ్లు షాక్‌కు గురైనట్టు తెలుస్తోంది. ఇక ఆ ఐరన్ పైపులపై బట్టలు ఆరపెట్టె సమయంలోనే సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. మృతులు ఓడిశాలోని బాజీపూర్ మండలానికి చెందిన చెందిన వాసుదేవ మాలిక్ అని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులతో పాటు విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇక శనివారం రాత్రి మొయినాబాద్‌లో మద్యం మత్తులో జరిగిన కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు. స్పాట్లో ప్రేమిక అనే ఒక అమ్మయి చనిపోగా నేడు ఉదయం సౌమ్య అనే అమ్మాయి మృత్యువాత పడింది. కాగా మరో అమ్మాయి అక్షయ పరిస్థితి విషమంగా ఉంది. కనకమేడల గ్రామంలో కారు డ్రైవర్ సందీప్ రెడ్డి మద్యం మత్తులో ఉండడంతో ముగ్గురు వెళుతున్న స్కూటిని ఢీ కొట్టాడు. కాగా సందీప్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా మొయినాబాద్‌లో ఎక్కువగా ఫాంహౌజ్‌లు ఉండడంతో వీకెండ్ పార్టీలు అధికంగా కొనసాగుతున్నాయని, ఈ క్రమంలోనే మందు బాబులు రెచ్చిపోతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ చెకప్‌లు నిత్యం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.