బోరుబావిలో పడ్డ చిన్నారి... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

అయితే బోరుబావిలో చిన్నారికి శ్వాస ఆడేలా గొట్టల ద్వారా ఆక్సిజన్ నిరంతరం అందిస్తూ వచ్చారు. చిన్నారిని ఇవాళ ఉదయం బయటకు తీసిన వెంటనే... ఫతేవీర్ సింగ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

news18-telugu
Updated: June 11, 2019, 10:52 AM IST
బోరుబావిలో పడ్డ చిన్నారి... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
92 Hours and Counting: Two-year-old Still Trapped in 150-ft-borewell Despite Frantic Rescue Ops | బోరుబావిలో నాలుగురోజులు... క్షేమంగా బయటపడ్డ రెండేళ్ల బాలుడు
news18-telugu
Updated: June 11, 2019, 10:52 AM IST
పంజాబ్‌లో బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు మృత్యుంజయుడయ్యాడన్న కాసేపట్లోనే... తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దాదాపు 96 గంటలపాటు... అంటే నాలుగురోజుల పాటు.. బోరుబావిలోనే ఉన్న బాబును ప్రాణాలతో బయటకు తీశారు కానీ... ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి కాసేపటి క్రితమే చనిపోయడు.ఊపిరితో బయటపడ్డాయన్న ఆనందం కాసేపు కూడా ఆ తల్లిదండ్రులకు దక్కలేదు.

పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలో గల బోరుబావిలో ఫతేవీర్ సింగ్ అనే రెండేళ్ల బాలుడు శుక్రవారం సాయంత్రం పడిపోయాడు. అక్కడ బోరువేశారు .. అయితే నీళ్లు పడకపోవడంతో బట్ట కప్పి ఉంచారు. ఇంతలో ఆటుగా ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు అందులో పడిపోయాడు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న రెస్క్యూ సిబ్బంది.. తీవ్రంగా శ్రమించారు. 150 అడుగులు లోతు ఉన్న బోరుబావిలో 125 అడుగుల లోతులో బాలుడి ఇరుక్కుపోయాడని గుర్తించారు.

వెంటనే బాలుడ్ని బయటకు తీసేందుకు చర్యలు ప్రారంభించారు. జేసీబీలతో సమాంతరంగా మరో గోతిని తవ్వారు. బాలుడి బోరుబావలో పడి నాలుగురోజులు అయినా కూడా పనులు ఆపకుండా చిన్నారిని కాపాడేందుకు నిరంతరం శ్రమించారు. బోరుబావిలో చిన్నారికి శ్వాస ఆడేలా గొట్టల ద్వారా ఆక్సిజన్ నిరంతరం అందిస్తూ వచ్చారు. వాళ్ల శ్రమ వృథా కాలేదనుకున్నారు. రెండేళ్ల బాలుడ్ని ప్రాణాలతో బయటకు తీశారు. వెంటనే అంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

బాలుడిని బయటకు తీసేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బందితోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ నిపుణుగుల కూడా సహాయక చర్యల్లో పాల్గొంది. బోరుబావికి సమాంతరం మరో గుంత తవ్వారు. కొంచెం లోతు వెళ్లకా .. పైపు ద్వారా బాలుడిని బయటకు తీశారు. పాపం ప్రాణాలతో బయటపడ్డడన్న చిన్నారి తల్లిదండ్రులకు ఆ ఆనందం ఎంతసేపు నిలవలేదు. ఇంతలోనే కన్నబిడ్డ చావు వార్త విని గుండెలవిసేలా రోదించారు. దీంతో వారిని ఓదార్చడం ఎవరివల్ల కాలేదు.First published: June 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...