Home /News /crime /

TWO WORKERS CLEANING SEPTIC TANK DIE OF ASPHYXIATION AT KONDAPUR IN HYDERABAD MKS

Hyderabad : మరో ఘోరం : సెప్టిక్ ట్యాంక్‌లో ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి -నల్గొండ నుంచి వలసొచ్చి..

సెప్టిక్ ట్యాంక్ లో చనిపోయిన కార్మికుల్ని బయటికి తీస్తోన్న ఫైర్సిబ్బంది

సెప్టిక్ ట్యాంక్ లో చనిపోయిన కార్మికుల్ని బయటికి తీస్తోన్న ఫైర్సిబ్బంది

హైదరాబాద్ లోని కొండాపూర్ ప్రాంతంలో ఆదివారం ఘోర సంఘటన చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా మనుషుల్ని సెప్టిక్ ట్యాంక్ లోకి దింపి, శుభ్రం చేయిస్తుండగా.. ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతిచెందారు. కొండాపూర్ లోని గౌతమి ఎనక్లేవ్ లోని హేమ దుర్గ అపార్ట్మెంట్ లో ఈ ఘటన జరిగింది.

ఇంకా చదవండి ...
విశ్వనగరం హైదరాబాద్ (Hyderabad) లో మరో ఘోరం జరిగింది. మురుగు వ్యవస్థను నిర్వహించడానికి యంత్రాలు మాత్రమే వాడాల్సి ఉండగా, ప్రమాదకర వాయివులుండే సెప్టిక్ ట్యాంకుల్లోకి మనుషుల్ని దింపిన ఘటన మరోటి వెలుగులోకి వచ్చింది. సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేస్తూ గతంలో పలువురు కార్మికులు మరణించిన నేపథ్యంలో యంత్రాలను మాత్రమే వాడాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana government) ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, అవి కచ్చితంగా అమలు కాకపోవడంతో ఇప్పుడు మరో రెండు పేద ప్రాణాలు బలైపోయాయి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలివి..

హైదరాబాద్ లోని కొండాపూర్ ప్రాంతంలో ఆదివారం ఘోర సంఘటన చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా మనుషుల్ని సెప్టిక్ ట్యాంక్ లోకి దింపి, శుభ్రం చేయిస్తుండగా.. ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతిచెందారు. కొండాపూర్ లోని గౌతమి ఎనక్లేవ్ లోని హేమ దుర్గ అపార్ట్మెంట్ లో ఈ ఘటన జరిగింది. మురుగు వ్యవస్థ పాడైపోవడంతో అపార్ట్మెంట్ నిర్వాహకులు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయాల్సిందిగా ‘డయల్ ఏ సెప్టిక్ ట్యాంక్’ అనే ప్రైవేట్ సంస్థను సంప్రదించారు.

ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది

Karimnagar mlc : బండి సంజయ్‌కి ఈటల పోటు.. bjpకి కొత్త అధ్యక్షుడు.. సర్దార్ రవీందర్ సింగ్ ఖేల్ ఖతమంటూ



నిర్వాహకులు ఫోన్ చేయడంతో పెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ సంస్థకు చెందిన అంజి (30), శ్రీను(32) అనే ఇద్దరు కార్మికులు అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. సెప్టిక్ ట్యాంక్ లోకి దిగి శుభ్రం చేస్తుండగా.. వారిద్దరూ ఊపిరాడక స్పృహకోల్పోయారు. ఇది గమనించిన మిగతా వాళ్లు పోలీసులకు సమాచారం అందించగా, మాదాపూర్ ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ చేపట్టింది. కార్మికులు ఇద్దరినీ బయటికి తీయగా, అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు.

Godavarikhani : ముక్కలుగా నరికి.. వీధికొకటి విసిరేసి.. మీసేవ ఆపరేటర్ దారుణహత్య.. భార్య పనేనా?



సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అంజి, శ్రీనులను సైదాబాద్ సమీపంలోని సింగరేణి కాలనీకి చెందినవారుగా గుర్తించారు. మృతుల స్వస్థలం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం గాజీనగర్ గ్రామమని, పనుల నిమిత్తం సిటీకి వలస వచ్చారని పోలీసులు తెలిపారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరగ్గా, మున్సిపల్ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించి ఆయా సంస్థలపై చర్యలకు ఆదేశించారు. ఇప్పుడు అంజి, శ్రీనుల కుటుంబాలకు కూడా న్యాయం చేయాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి.

మీ నగరం నుండి (​హైదరాబాద్)

రాష్ట్రం ఎంచుకోండి
​హైదరాబాద్
రాష్ట్రం ఎంచుకోండి
​హైదరాబాద్
Published by:Madhu Kota
First published:

Tags: Hyderabad, Labour

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు