హోమ్ /వార్తలు /క్రైమ్ /

Women Techies Killed : సాఫ్ట్ వేర్ ఉద్యోగినులపై దూసుకెళ్లిన కారు..ఇద్దరు మృతి

Women Techies Killed : సాఫ్ట్ వేర్ ఉద్యోగినులపై దూసుకెళ్లిన కారు..ఇద్దరు మృతి

కారు ఢీకొట్టడంతో మరణించిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు

కారు ఢీకొట్టడంతో మరణించిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు

ఇద్ద‌రు మ‌హిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌ను వేగంగా వ‌చ్చిన ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు టెకీలు దుర్మ‌ర‌ణం చెందారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరు మహిళా టెకీల(Two women Techies) ప్రాణం తీసింది. రోడ్డు దాటుతున్న ఇద్ద‌రు మ‌హిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌ను వేగంగా వ‌చ్చిన ఓ కారు ఢీ కొట్టింది..ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు టెకీలు దుర్మ‌ర‌ణం చెందారు. త‌మిళ‌నాడు రాజధాని చెన్నైలో(Chennai) బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. అయితే మరణించిన ఇద్దరు టెకీలలో ఒకరిది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కాగా,మరొకరిది కేరళలోని పాలక్కడ్.

అసలేం జరిగింది

ఎస్ లావణ్య, ఆర్ లక్ష్మీ ఇద్దరు 20 ఏళ్ల యువతులు చెన్నైలోని HCL స్టేట్ స్ట్రీట్ సర్వీస్ కంపెనీలో ఆనలిస్ట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు షిప్ట్ ముగించుకొని వారిద్దరూ ఇంటి వచ్చేందుకు బయలదేరారు. ఓఎంఆర్ వ‌ద్ద‌ రోడ్డును దాటుతున్నారు. అదే స‌మ‌యంలో అటుగా వెలుతున్న ఓ హోండా సిటీ కారు అదుపుత‌ప్పి వారి పైకి దూసుకువెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ కారు స్పీడ్ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ఘటనలో ఏపీకి చెందిన లావణ్య స్పాట్‌లో చనిపోయింది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని తీవ్రంగా గాయ‌ప‌డిన లక్ష్మీని ఆస్ప‌త్రికి త‌ర‌లించగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ లక్ష్మీ మరణించింది. లక్ష్మీ స్వస్థలం కేరళలోని పాలక్కాడ్ కాగా,లావణ్యది ఏపీలోని చిత్తూరు . చనిపోయిన వారి మృతదేహాలను ప్రభుత్వమే అంబులెన్స్ లు ఏర్పాటు చేసి ఇంటికి చేర్చింది. అయితే కారు వేగంగా నడిపి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన డ్రైవర్‌ మొతీశ్ కుమార్‌(20)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కారు అదుపు త‌ప్ప‌డంతోనే ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Viral Video : రైలులో ఫోన్ చోరికి యత్నించి ప్రయాణికులు చేసిన పనికి బిత్తరపోయిన దొంగ..దణ్ణం పెడతా వదలొద్దంటూ వేడుకోలు

కాగా,నిత్యం ర‌ద్దీగా ఉండే ఈ ఐటీ కారిడార్ ప్రాంతంలో జీబ్రా క్రాసింగ్ లేక‌పోవ‌డంతో పాదాచారులు త‌ర‌చూ ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నార‌ని ప‌లువురు స్థానికులు చెబుతున్నారు. ఐటీ కంపెనీ ఉన్న సముదాయాల్లో భారీగా నివాస గృహలు కూడా ఉన్నాయి. అక్కడ జీబ్రా క్రాసింగ్ లైన్స్ లేకపోవడంతో పాదచారులు నడిచేందుకు ఇబ్బంది కలుగుతుంది. దీనిని ఆర్ అండ్ బీ పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Chennai, Crime news, Tamil nadu

ఉత్తమ కథలు