Home /News /crime /

TWO WOMEN HELD AT COIMBATORE AIRPORT FOR CONCEALING GOLD WORTH RS 62 LAKH IN SANITARY PADS SU

శానిటరీ ప్యాడ్స్‌లో దాచి బంగారం అక్రమ రవాణా.. ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన అధికారులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బంగారం అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు మహిళలను కొయంబత్తూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలు ధరించిన అండర్ వేర్‌ల లో బంగారం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.

    బంగారం అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు మహిళలను కొయంబత్తూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలు ధరించిన అండర్ వేర్‌ల లో బంగారం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వారివద్ద నుంచి 1.1 కేజీ విలువ చేసే 62 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాళ్లను చెన్నైకి చెందిన దేవాని రాధకృష్ణనా, పుడుకొట్టైకి చెందిన వసంతి రామస్వామిగా గుర్తించారు. వీరిద్దరు ఉదయం మూడున్నర గంటల ప్రాంతంలో షార్జా నుంచి ఎయిర్ అరేబియా విమానంలో కొయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే బంగారం అక్రమంగా తరలిస్తున్నారన్న కొద్దిపాటి సమాచారంతో కస్టమ్స్ అధికారులు వారిని తనిఖీ చేశారు.

    మెటల్ డిటేక్టర్‌ సాయంతో తనిఖీలు చేపట్టిన అధికారులు.. వారు బంగారం దాచిపెట్టారని గుర్తించారు. ఇద్దరు మహిళలు.. వారు ధరించిన శానిటరీ ప్యాడ్‌లో పేస్ట్ రూపంలో బంగారం దాచినట్టు కనుగొన్నారు. వెంటనే వారిద్దరినీ కస్టడీలోకి తీసుకున్నారు. ఇక, ఈ ఇద్దరు మహిళలతో పాటుగా అదే విమానంలో ప్రయాణించిన మరికొందరి నుంచి అక్రమంగా తరలిస్తున్న వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తుల నుంచి 46 లక్షల రూపాయలు విలువచేసే.. బంగారం, లిక్కర్, సిగరేట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

    ఇద్దరు మహిళలు శానిటరీ ప్యాడ్‌లో 62.46 లక్షల రూపాయలు విలువ చేసే 1,195.6 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా తాము అదుపులోకి తీసుకున్నట్టుగా అధికారులు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Gold smuggling, Tamil nadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు