Home /News /crime /

TWO WOMEN GONE MISSING IN TELUGU STATES PRN

Missing Mystery: తెలుగు రాష్ట్రాల్లో మిస్సింగ్ మిస్టరీ.. వాళ్లిద్దరు ఏమయ్యారు..?

లక్ష్మీప్రసన్న, దుర్గా భవానీ

లక్ష్మీప్రసన్న, దుర్గా భవానీ

తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు యువతుల మిస్సింగ్ కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తూర్పుగోదావరి జిల్లాలో (East Godawari) ఒకరు, తెలంగాణలోని (Telangana) హైదరాబాద్ (Hyderabad) లో మరొకరు అదృశ్యమయ్యారు.

    తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు యువతుల అదృశ్యం కలకలం రేపింది. ఇందులో ఒకరు పెళ్లైనవారు కాగా.. మరొకరు ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడే వస్తామని ఇళ్ల నుంచి బయటకు వెళ్లిన వారు సడన్ గా కనిపించకపోయే సరికి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ఒకరు ప్రేమ వివాహం చేసుకోవడానికి ఇంటినుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం, తాటిపాకమఠం గ్రామానికి చెందిన కట్టా లక్ష్మీ ప్రసన్నకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు మూడేళ్ల పాప సహస్ర కూడా ఉంది. నిన్న పాపను తీసుకొని వెళ్లిన ప్రసన్న ఇంతవరకు తిరిగిరాలేదు.

    లక్ష్మీ ప్రసన్న తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిపోయిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ లను కూడా సేకరించే పనిలో ఉన్నారు.

    ఇక హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో యువతి మిస్సింగ్ కలకలం రేపింది. వెంకన్న, రాజేశ్వరి దంపతుల కుమార్తె దుర్గాభవాని.. హైదరాబాద్ డయాబెటిక్ సెంటర్లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తోంది. నిన్న ఉదయం ఆఫీసుకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లిన ఆమె ఎంతకి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె పనిచేస్తున్న హాస్టిల్ లో విచారించారు. ఆమె సాయంత్రమే వెళ్లిపోయినట్లు అక్కడివారు తెలపడంతో ఆందోళనకు గురయ్యారు. ఐతే దుర్గాభవాని రాత్రికి తన సోదరుడికి ఫోన్ చేసి పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాని..తన కోసం వెతకవద్దని చెప్పినట్లు సమాచారం.

    కుటుంబ సభ్యులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా..వారు దర్యాప్తు చేస్తున్నారు. సోదరుడికి చివరిసారిగా ఫోన్ చేసిన సిగ్నల్ టవర్ ను పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. అలాగే ఆస్పత్రిలో సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. భవానీకి నిజంగా ప్రేమ వ్యవాహరం ఉందా లేద అబద్ధం చెప్పిందా అనే కోణంలోనూ విచారిస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, East Godavari Dist, Hyderabad news, Missing case, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు