ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న వారితో ఆ మహిళల శృంగారం.. ఎలా బయటపడిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఎలాగైనా పాలసీల విషయంలో టార్గెట్లు చేరుకోవాలని.. లేకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని వారిపై అధికారులు వార్నింగ్ ఇచ్చారు. దీంతో పాలసీలను అమ్మేందుకు ఆ ఇద్దరు మహిళలు పక్కదారి పట్టారు.

 • Share this:
  దేశంలోని కొందరు కొత్త కొత్త మార్గాల్లో నేరాలు చేయడం అలవాటు చేసుకుంటున్నారు. ఇలాంటి ఓ వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో వెలుగు చూసింది. ఇన్సూరెన్స్ పాలసీలు చేయించే ఉద్యోగంలో చేరిన ఇద్దరు మహిళలు.. ఆ తరువాత ఏకంగా సెక్స్ రాకెట్ నడిపించే స్థాయికి చేరుకోవడం ఈ మొత్తం వ్యవహారంలో ఊహించని పరిణామం. మొరాదాబాద్‌కు చెందిన ఇద్దరు మహిళలు ఇన్సూరెన్స్ పాలసీలు చేయించే ఉద్యోగంలో చేరారు. అనేక మంది ఎగ్జిక్యూటివ్స్ తరహాలోనే పాలసీలు తీసుకోవాలని కస్టమర్లకు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. అయితే బయట ఎక్కువమందికి ఎదురయ్యే పరిస్థితులే వీరికి కూడా ఎదురయ్యాయి. ఇన్సూరెన్స్ అనగానే చాలామంది వీరిని పట్టించుకోలేదు. వీళ్లు ఫోన్ చేసినా.. లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఈ ఇద్దరు మహిళలు తమ నెలవారీ టార్గెట్‌ను పూర్తి చేయలేకపోయారు. ఆరు నెలల్లో కేవలం రెండు పాలసీలు మాత్రమే వీరి ఖాతాలో చేరాయి.

  దీంతో కంపెనీ నుంచి వీరిపై ఒత్తిడి పెరిగింది. ఎలాగైనా పాలసీల విషయంలో టార్గెట్లు చేరుకోవాలని.. లేకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని వారిపై అధికారులు వార్నింగ్ ఇచ్చారు. దీంతో పాలసీలను అమ్మేందుకు ఆ ఇద్దరు మహిళలు పక్కదారి పట్టారు. పాలసీలు తీసుకున్న కస్టమర్లతో సెక్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఒకరిద్దరు కస్టమర్లు మహిళలు ఇచ్చిన ఈ ఆఫర్‌ను స్వీకరించారు. వారితో సెక్స్ చేసి.. ఆ తరువాత పాలసీలు తీసుకున్నారు. దీంతో కస్టమర్లను ఆకర్షించేందుకు, పాలసీలు అమ్మేందుకు ఇదే పద్ధతిని ఫాలో అయ్యారు ఆ ఇద్దరు మహిళలు.

  ఇలా చేయడం వల్ల వారికి ఒక్క నెలలోనే ఏకంగా రూ. 75 వేల కమిషన్ వచ్చింది. దీంతో పాలసీలు తీసుకునేందుకు నిరాకరించిన కస్టమర్లకు సెక్స్ ఆఫర్ చేయడం.. ఆ తరువాత వాళ్లు పాలసీలు తీసుకునేలా చేయడం మొదలుపెట్టారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ పాలసీలు రావడంతో.. మరో ఐదుగురితో చేతులు కలిపి తమ బిజినెస్‌ను పెంచుకోవడానికి ప్లాన్ చేశారు. ఇతర దేశాల నుంచి చదువుకునేందుకు ఇక్కడకు వచ్చిన మహిళలను తమ బిజినెస్ కోసం ఉపయోగించుకోవాలని డిసైడయ్యారు.

  Maida Flour: మైదా పిండి అనేక ఆరోగ్య సమస్యలు కారణమని మీకు తెలుసా ?

  After Eating: భోజనం చేసిన తరువాత ఈ పనులు చేయొచ్చా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?

  మొదట వారిని కస్టమర్ కేర్ సెంటర్ తరహాలో కస్టమర్లకు ఫోన్ చేయించడం.. ఆ తరువాత వారిని మెల్లిగా ముగ్గులోకి దించి సెక్స్ ఆఫర్ చేయడం.. అలా అలా తమ పని పూర్తి చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలా కొనసాగుతున్న వీరి చీకటి వ్యవహారం గురించి పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ గ్యాంగ్‌లోని ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వాళ్లు తమ ఇన్సూరెన్స్ బిజినెస్ వ్యవహారమంతా బయటపెట్టారు. దీంతో ఈ బిజినెస్‌ను మొదలుపెట్టిన ఇద్దరు మహిళలను, వారితోపాటే బిజినెస్ చేస్తున్న మరికొందరిని అదుపులోకి తీసుకుని ఈ చీకటి వ్యాపారానికి తెరదించారు.
  Published by:Kishore Akkaladevi
  First published: