• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • TWO WOMAN CONSTABLES COMMITS SUICIDE IN SEPARATE INCIDENTS SSR

ఒకరికి పెళ్లైంది.. మరొకరు పెళ్లి కాని యువతి.. క్షణికావేశంలో ఎంతపని చేశారమ్మా..!

ఒకరికి పెళ్లైంది.. మరొకరు పెళ్లి కాని యువతి.. క్షణికావేశంలో ఎంతపని చేశారమ్మా..!

మోనికా, మరో బాధితురాలు

విధుల్లో చేరిన కొత్తలో ఎంతో ఉత్సాహంగా కనిపించిన మోనికా ప్రవర్తనలో రానురానూ మార్పు కనిపించిందని సహోద్యోగులు చెప్పారు. గత కొద్ది రోజుల నుంచి ఆమె చాలా నిరుత్సాహంగా కనిపించిందని.. కారణమేంటని అడిగితే అలాంటిదేమీ లేదని దాటవేసిందని తెలిపారు. కారణమేంటో తెలియదు గానీ తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న మోనికా...

  • Share this:
    అర్వాల్: బీహార్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆత్మహత్యకు గల కారణాలు ప్రస్తుతానికి తెలియలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని అర్వాల్ జిల్లా కింజార్ పోలీస్ స్టేషన్‌లో మోనికా కుమారి అనే యువతి మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. 2018 బ్యాచ్‌కు చెందిన ఆమె ట్రైనింగ్ అనంతరం.. అర్వాల్‌లో పోస్టింగ్ తీసుకుంది. అప్పటి నుంచి ఆమె కింజార్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. విధుల్లో చేరిన కొత్తలో ఎంతో ఉత్సాహంగా కనిపించిన మోనికా ప్రవర్తనలో రానురానూ మార్పు కనిపించిందని సహోద్యోగులు చెప్పారు. గత కొద్ది రోజుల నుంచి ఆమె చాలా నిరుత్సాహంగా కనిపించిందని.. కారణమేంటని అడిగితే అలాంటిదేమీ లేదని దాటవేసిందని తెలిపారు. కారణమేంటో తెలియదు గానీ తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న మోనికా పోలీస్ స్టేషన్‌ పరిసరాల్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలియగానే.. ఎస్పీ రాజీవ్ రంజన్, డీఎస్పీ అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. మోనికాకు ఇంకా వివాహం కాలేదు. ఆమె స్వస్థలం పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమేమైనా కారణమేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోనికా మృతదేహాన్ని సదర్ హాస్పిటల్‌కు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే.. ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులెవరూ రాకపోవడం గమనార్హం. కింజార్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మోనికా అక్కడికి దగ్గర్లోనే ఓ అద్దె ఇంట్లో నివాసముండేది. దర్యాప్తులో భాగంగా ఆ ఇంటిని కూడా పోలీసులు పరిశీలించనున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో కూడా మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఆ మహిళా కానిస్టేబుల్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. ఓ ఎస్‌ఐ ఆమెను మానసికంగా వేధించాడని, ఆమె ఆత్మహత్యకు పాల్పడటానికి అతనే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.

    కేతన్ మంజ్రే అనే ఎస్‌ఐ ఆమెను కొన్ని నెలలుగా వేధిస్తున్నాడని, అతని విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరిగాయని చెబుతున్నారు. కేతన్ మంజ్రే బాధిత మహిళతో జరిపిన చాటింగ్ సంభాషణలను ఆమె భర్త చూశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కాపురంలో కలతలు రేగడంతో తీవ్ర మనస్తాపం చెందిన బాధితురాలు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ వైశాలి కదుకర్ చెప్పారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సదరు ఎస్‌ఐది తప్పుందని తేలితే అతనిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు