హోమ్ /వార్తలు /క్రైమ్ /

Gold Smuggling: వామ్మో నోట్లో అంత బంగారం ఎలా పట్టిందిరా బాబు..! ఎయిర్ పోర్టులో పట్టుబడ్డ బంగారం..

Gold Smuggling: వామ్మో నోట్లో అంత బంగారం ఎలా పట్టిందిరా బాబు..! ఎయిర్ పోర్టులో పట్టుబడ్డ బంగారం..

నోట్లో బంగారాన్ని చూపిస్తున్న స్మగ్లర్

నోట్లో బంగారాన్ని చూపిస్తున్న స్మగ్లర్

Gold Smugling: దుబాయ్ నుంచి వస్తున్న ఇద్దరు ఉజ్బెకిస్తానీలను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారాన్ని నోటి కుహరంలో దాచి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డారు. ఈ విషయాన్ని ఢిల్లీ కస్టమ్స్ విభాగం తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...

భారత్ (India) లో బంగారం(Gold) ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దాదాపు 10 గ్రాముల బంగారం ధర రూ.50 వేలకు చేరుకుంది. అయితే మన దేశంలో కంటే ఇతర దేశాల్లో బంగారం ధరలుచాలా తక్కువగా ఉంటాయి. ఇలా వేరే దేశాలను నుంచి బంగారు దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి అవసరం. బంగారం ఎగుమతి, దిగుమతి(Exports and Imports) వ్యవహారం అంతా ప్రభుత్వం(Government) చేతుల్లోనే ఉంటుంది. అయితే కొంత మంది స్మగ్లర్లు(Smuggling) వాటిని ఒక దేశం నుంచి మరో దేశానికి తీసుకు వెళ్లేందుకు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. పోలీసులకు చిక్కకుండా తన శరీరాన్ని కూడా సాధనంగా వాడుకుంటున్నారు. తమిళ హీరో సూర్య నటించిన ‘వీడొక్కడే’ సినిమాలో హీరో స్నేహితుడిగా చేసిన వ్యక్తి బంగారాన్ని కడుపులో దాచుకొని విమానంలో ప్రయాణం చేస్తాడు. అచ్చం అలాగే ఇప్పుడు ప్రయత్నించి ఢిల్లీ ఎయిర్‌‌పోర్టులో ఇద్దరు స్మగ్లర్లు దొరికిపోయారు.

వాహన కొనుగోలుదారులకు గుడ్​న్యూస్.. ఆ సంస్థ వాహనాల కొనుగోలుపై రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్.. వివరాలివే.. 


ఇలా స్మగ్లర్లు తెలివితో శరీరంలోని బంగారాన్ని నోట్లో దాచి పెట్టుకొని విమానాల్లో ప్రయాణించారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు ఉజ్బెకిస్థానీలను ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్ ట్వీట్ చేసింది. వారి వద్ద నుంచి దాదాపు 951 గ్రాముల బంగారం పళ్లకు సెట్ రూపంలో బంగారపు చెయిన్‌ను అమర్చుకుని ఆ ఇద్దరు వస్తుండగా అరెస్టు చేసినట్లు పేర్కొంది. ‘‘ఆగస్టు 28వ తేదీ రాత్రి దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు ఉజ్బెకిస్థాన్ దేశస్తులను ఢిల్లీ ఎయిర్‌‌పోర్టులో కస్టమ్స్ ఆఫీసర్లు అరెస్టు చేశారు.

Fixed Deposit Rates: ఎఫ్​డీ వడ్డీ రేట్లను సవరించిన ప్రముఖ బ్యాంక్.. నేటి నుంచే అమల్లోకి కొత్త వడ్డీ రేట్లు..


పంటికి పెట్టుకునే సెట్‌ రూపంలో పూతపోసి 951 గ్రాముల బంగారాన్ని ఆ ఇద్దరూ నోట్లో అమర్చుకుని తీసుకొచ్చారు” అని ఢిల్లీ కస్టమ్స్‌ ట్వీట్ చేసింది. ఇద్దరిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా.. ఆ బంగారం ఎక్కడది..? దీని వెనుక స్మగ్లింగ్ ముఠా ఏమైనా ఉందా.. అన్న కోణంలో ఆ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Ig Nobel Prizes: సెక్స్ చేస్తే ముక్కు ఉపశమనంగా ఉంటుందని కనుక్కున్నారు.. నోబెల్ ప్రైజ్ కొట్టేశారు..


ఇదిలా ఉండగా మరో కేసులో మస్కట్ నుంచి ఓ భారతీయుడిని కూడా కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు. అతడి వద్ద నుంచి దాదాపు బ్రౌన్ పేస్ట్ రూపంలో 1801 గ్రాముల బంగారాన్ని అతడి ప్యాంట్ జీన్స్ జేబులో పెట్టుకొని వస్తుండగా అతడి అదుపులోకి తీసుకున్నట్లు ట్వీట్ చేశారు.

First published:

Tags: Airport, Delhi, Gold, Gold smuggling

ఉత్తమ కథలు