లాటరీ వచ్చిందని నమ్మించి.. బ్యాంకుకు తీసుకెళ్లి.. వృద్ధ దంపతులను..

బ్యాంకు లోపలికి వెళ్లే ముందు శరీరం మీద ఉన్న బంగారం అంతా తీసి వెళ్లాలని చెప్పారు. అనంతరం భర్తను బంగారంతో బయట ఉండమని చెప్పి.. భార్యను తీసుకుని లోపలికి వెళ్లారు.

news18-telugu
Updated: July 12, 2020, 11:10 AM IST
లాటరీ వచ్చిందని నమ్మించి.. బ్యాంకుకు తీసుకెళ్లి.. వృద్ధ దంపతులను..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వారిద్దరూ వృద్ధ దంపతులు. ఓ పని నిమిత్తం గ్రామం నుంచి పట్టణానికి వచ్చారు. వారిని గమనించిన ఓ ఇద్దరు వ్యక్తులు వారి దగ్గరికి వెళ్లి మాటామాటా కలిపారు. మీకు లాటరీ వచ్చిందంటూ మాయమాటలు చెప్పి నమ్మించారు. బ్యాంకుకు వెళితే లాటరీకి సంబంధించిన డబ్బు తీసుకోవచ్చంటూ చెప్పారు. ఆపై వారి దగ్గర ఉన్న నాలుగు తులాల బంగారంతో ఉడాయించారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలంలోని యంగంపల్లికి చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు వ్యక్తిగత పని నిమిత్తం కల్వకుర్తి పట్టణానికి వచ్చారు. కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్‌నగర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే ఓ ఇద్దరు వ్యక్తులు ఆ వృద్ధ దంపతుల దగ్గరికి వచ్చారు. వారితో మాటామాటా కలిపి.. మీకు లాటరీ వచ్చిందంటూ మాయమాటలు చెప్పి నమ్మించారు.

బ్యాంకుకు వెళితే లాటరీ సొమ్ము తీసుకోవచ్చని పట్టణంలోని ఓ బ్యాంకుకు తీసుకెళ్లారు. అయితే బ్యాంకు లోపలికి వెళ్లే ముందు శరీరం మీద ఉన్న బంగారం అంతా తీసి వెళ్లాలని చెప్పారు. అనంతరం భర్తను బంగారంతో బయట ఉండమని చెప్పి.. భార్యను తీసుకుని లోపలికి వెళ్లారు. కొద్దిసేపటికే ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు వచ్చి.. మీ భార్య బంగారం తీసుకురమ్మందని చెప్పి.. వృద్ధుడి దగ్గరి నుంచి బంగారం తీసుకెళ్లారు. ఆ బంగారం తీసుకుని ఆ ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. దీంతో ఆ వృద్ధ దంపతులు తాము మోసపోయామని గ్రహించి పోలీసులకు విషయం చెప్పారు. వృద్ధుల దగ్గరి నుంచి పలు వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Published by: Narsimha Badhini
First published: July 12, 2020, 11:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading