హోమ్ /వార్తలు /క్రైమ్ /

khammam: రెండు వారాల నుంచి వాళ్లిద్దరూ హాస్టల్‌లో లేరు..స్టూడెంట్స్‌ మిస్సింగ్‌పై కలకలం

khammam: రెండు వారాల నుంచి వాళ్లిద్దరూ హాస్టల్‌లో లేరు..స్టూడెంట్స్‌ మిస్సింగ్‌పై కలకలం

(రెండు వారాలైంది పత్తాలేరు)

(రెండు వారాలైంది పత్తాలేరు)

Khammam:గిరిజన హాస్టల్‌లో ఉంటూ చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ రెండు వారాలుగా కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లారని పేరెంట్స్‌ హాస్టల్ వార్డెన్‌ని నిలదీస్తే మాకేం తెలుసు..మీరే వెదుక్కోమని నిర్లక్ష్య సమాధానం ఇచ్చాడు. దీంతో బిడ్డల ఆచూకి వెదికిపెట్టమని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లాలో విద్యార్ధుల మిస్సింగ్ కేసు తల్లిదండ్రుల్ని కలవరపెడుతోంది.

ఇంకా చదవండి ...

(G.srinivasreddy,News18 telugu,Khammam)

ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్ధుల భద్రతను అధికారులు గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఖమ్మం (Khammam)జిల్లా పాల్వంచ (Palvancha) కిన్నెరసాని గిరిజన స్పోర్ట్స్ స్కూల్‌లో చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్‌ అదృశ్యమయ్యారు. అయితే ఈఘటన జరిగిన 14రోజుల తర్వాత బయటపడింది. దుమ్ముగూడెం(Dummugudem) మండలం బండిరేవు(Bandirevu) గ్రామానికి చెందిన పూనేం సతీష్(Poonem Satish), గొంది జయంత్ (Gondi Jayant) కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నారు. గత నెల 19వ తేదిన విద్యార్థుల తల్లితండ్రులు ప్రభుత్వ బాలుర హాస్టల్‌కు వచ్చి విద్యార్థులను కలిసి వెళ్లారు. ఆ తర్వాత రోజు నుంచే సతీష్‌, జయంత్ కనిపించకుండాపోయారు. దాదాపు రెండు వారాలు గడిచినప్పటికి హాస్టల్ వార్డెన్(Hostel Warden) ఈవిషయాన్ని గోప్యంగా ఉంచాడు. తోటి విద్యార్ధులు జయంత్, సతీష్‌ తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకు తమ బిడ్డలు హాస్టల్‌లో ఉండి చదువుతున్నారని భావించిన పేరెంట్స్‌ విషయం తెలిసి షాక్ అయ్యారు. వెంటనే హాస్టల్‌కి వార్డెన్‌ పురుషోత్తమ్‌కి ఫోన్‌ చేసి తమ పిల్లల గురించి అడిగారు. అందుకు నిర్లక్యంగా సమాధానం ఇచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు వారాల క్రితం మాయం..

కనిపించకుండాపోయిన విద్యార్ధులను మీరు వచ్చి వెతుక్కోండి పొగరుగా సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుటాహుటిన తల్లితండ్రులు హాస్టల్ కు చేరుకొని వార్డెన్ ను నిలదీయడంతో రెండురోజులు టైమ్ ఇవ్వమని పిల్లల్ని వెతికిస్తామనని అంతవరకు ఎవరికి చెప్పవద్దని చెప్పాడు. ఇంతలోగా మీరు పాల్వంచ చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించమని తల్లిదండ్రులకు చెప్పాడు వార్డెన్ పురుషోత్తం. బిడ్డల ఆచూకి కోసం అమాయక గిరిజన పేరెంట్స్ తింటి, తిప్పలు, కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పాల్వంచలో వెదికారు.

ఇద్దరు స్టూడెంట్స్‌ ఏమైపోయారో..

తమ బిడ్డల ఆచూకి దొరక్కపోవడంతో వెంటనే పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు విద్యార్దుల తల్లిదండ్రులు. పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిన్నెరసాని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో సుమారు 350 మంది విద్యార్థులు ఉన్నారు. స్టూడెంట్స్‌ కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటే ..నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై మరింత మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన ఉపాధ్యాయవృత్తిలో ఉండి అలా మాట్లాడటం సరికాదంటున్నారు. తమ బిడ్డల్ని నమ్మి హస్టల్‌కి పంపితే ఇలాంటి సమాధానం చెప్పడం విస్మయానికి గురిచేస్తుందన్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల వార్డెన్ లు,ఉపాధ్యాయులు స్థానికంగా ఉండకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ పిల్లలను వెతికిపెట్టాలని నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

First published:

Tags: Khammam police, VIRAL NEWS

ఉత్తమ కథలు