Home /News /crime /

TWO TERRORISTS KILLED IN PULWAMA ENCOUNTER AK RIFLES RECOVERED SAYS POLICE PVN

Pulwama Encounter: పుల్వామాలో ఎన్ కౌంటర్..ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Two terrorists killed : జమ్ముకశ్మీర్‌(Jammu and Kashmir)లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతోంది. దక్షిణ కశ్మీర్ లోని పుల్వామా(Pulwama)జిల్లాలోని గండిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఇంకా చదవండి ...
Two terrorists killed : జమ్ముకశ్మీర్‌(Jammu and Kashmir)లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతోంది. దక్షిణ కశ్మీర్ లోని పుల్వామా(Pulwama)జిల్లాలోని గండిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు అనుమానిత జైష్-ఎ-మహ్మద్ (JeM) ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందడంతో ఆదివారం రాత్రి భద్రతా బలగాలు, స్థానిక పోలీసుల సంయుక్త బృందం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించాయి.. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు జరిగాయని, ఈ క్రమంలో వారిని కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సోమవారం ఉదయం మరో ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు ఐజీపీ పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రెండు ఏకే రైఫిల్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రియాజ్‌ అనే పోలీస్‌ను కాల్చి చంపిన ఘటనలో ఈ ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్నట్లుగా తెలిపారు.

ఇది ఈ ఏడాది 54వ ఎన్‌కౌంటర్‌గా పేర్కొనడం గమనార్హం. అంతకుముందు 53 ఆపరేషన్లలో భద్రతా బలగాలు 26 మంది పాకిస్థానీలతో సహా 84 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. 44 మంది చురుకైన ఉగ్రవాదులను, వారి 183 మంది సహచరులను అరెస్టు చేశారు. అయితే, ఈ ఏడాది కాశ్మీర్‌లో 14 మంది పౌరులు మరియు 16 మంది భద్రతా సిబ్బంది కూడా ఉగ్రవాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు.

ALSO READ Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక ప్రకటన.. త్వరలోనే

ఇటీవల జమ్ముకశ్మీర్​లో జరిగిన వరుస ఉగ్రవాద దాడుల్లో ఓ కానిస్టేబుల్​, టీవీ నటి బలయ్యారు. దీంతో ఉగ్రమూకలను కట్టడి చేసే చర్యలను ముమ్మరం చేసిన భద్రతా సిబ్బంది ఇటీవల జరిపిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో నలుగురు తీవ్రవాదలను మట్టుబెట్టారు. వీరిలో టీవీ నటి హత్యకు కారణమైన ఇద్దరు ముష్కరులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారని గుర్తించారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Jammu and Kashmir, Terrorists

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు