Encounter in Pulwama's Pahoo : జమ్ముకశ్మీర్ లో ముష్కరుల వేట కొనసాగుతోంది. కశ్మీర్ లో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లలో ఉగ్రవాదులను లేపేస్తుంది సైన్యం. తాజాగా జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలోని పహు ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భదత్రా బలగాలు హతమార్చాయి. పుల్వామా జిల్లాలోని పహు ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు, కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం ఆదివారం సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించినట్లు జమ్మూకశ్మీర్ పోలీస్ డీజీ తెలిపారు.
అయితే ఈ క్రమంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ముష్కరుల కాల్పులను బలగాలు ధీటుగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. సైన్యం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. కాగా,చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు లష్కరేతోయిబా ఉగ్ర సంస్థకు చెందినవారుగా గుర్తించారు. కశ్మీర్ వ్యాలీలో మూడు రోజుల వ్యధిలో జరిగిన నాలుగవ ఎన్ కౌంటర్ ఇది అని అధికారులు తెలిపారు. ఇంతకుముందు కుల్గామ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఇద్దరు పాక్ ఉగ్రవాదులను,బారాముల్లా ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఇవాళ మూడో ఎన్ కౌంటర్ లో పహు ప్రాంతంలో జరిగింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.