Home /News /crime /

TWO TERRORISTS KILLED IN ENCOUNTER IN KASHMIR PVN

Encounter : కశ్మీర్ లో వరుస ఎన్ కౌంటర్లు..ఉగ్రవాదులను లేపేస్తున్న సైన్యం..ఇవాళ ఇద్దరు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Encounter In Kashmir : జమ్ముకశ్మీర్‌ లో ముష్కరుల వేట కొనసాగుతోంది. కశ్మీర్​ లో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లలో ఉగ్రవాదులను లేపేస్తుంది సైన్యం. తాజాగా కుల్గాం, అనంతనాగ్​ జిల్లాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో మరో ఇద్దరు కీలక ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది

ఇంకా చదవండి ...
Encounter In Kashmir : జమ్ముకశ్మీర్‌ లో ముష్కరుల వేట కొనసాగుతోంది. కశ్మీర్​ లో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లలో ఉగ్రవాదులను లేపేస్తుంది సైన్యం. తాజాగా కుల్గాం, అనంతనాగ్​ జిల్లాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో మరో ఇద్దరు కీలక ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. శనివారం ఉదయం అనంత్‌నాగ్‌లోని సిర్హమా ప్రాంతంలో ముష్కరులు దాక్కున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాదిని మట్టుపెట్టారు అధికారులు. ముష్కరుడు లష్కరే తోయిబాకు కమాండర్​గా బాధ్యతలు నిర్వహిస్తున్న నిషార్​ దార్​గా గుర్తించారు. మరోవైపు కుల్గాం జిల్లాలో జరిగిన కాల్పుల్లో మరో ఉగ్రవాది మరణించాడని పోలీసులు తెలిపారు. కుల్గామ్‌ లో జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థకు చెందిన టెర్రరిస్టును మట్టుబెట్టామన్నారు. రెండు ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నట్లు కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్ చెప్పారు.

మరోవైపు, ముంబై పేలుళ్ల సూత్రదారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్​ సయీద్ కుమారుడు హఫీజ్​ తల్హా సయీద్ ​ను ఉగ్రవాదిగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. లష్కరే తోయిబాకు నిధులు సమకూర్చడం, దాడులకు ప్రణాళికలు వేయడం వంటి పలు ఉగ్రవాద కార్యక్రమాల్లో హఫీజ్​ తల్హా సయీద్ చురుకుగా పాల్గొంటున్నట్లు తెలిపింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం(యూఏపీఏ) 1967 ప్రకారం సయీద్​ ను ఉగ్రవాదిగా గుర్తించింది. ఇప్పటివరకు భారత్ ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో తల్పా సయీద్ 32వ వ్యక్తి.

ALSO READ Antique Shivalingam : అక్రమంగా అమెరికాకు తరలిస్తున్న 1800ఏళ్ల నాటి శివలింగం సీజ్

ఇక,2008 ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కరే తాయిబా ఉగ్రసంస్థ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ కు 33 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉగ్రసంస్థలకు ఆర్థిక సహకారం అందిస్తున్నాడన్న ఆరోపణలపై 2019లో హఫీజ్ పై..1997 నాటి ఉగ్రవాద నిరోధక చట్టం (ATA)లోని వివిధ సెక్షన్ల కింద పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజమ్ డిపార్ట్ మెంట్(CTD)నమోదుచేసిన రెండు కేసుల్లో అతడిని దోషి గా తేల్చిన యాంటీ-టెర్రరిజం కోర్టు శుక్రవారం హఫీజ్ కు 33ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఒక కేసులో 15.5 సంవత్సరాలు, మరో కేసులో 16.5 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ న్యాయమూర్తి ఎజాజ్ అహ్మద్ బుట్టార్ తీర్పు చెప్పారు. జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల 40వేలు జరిమానా విధించిన కోర్టు. ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కేసుల్లో 70 ఏండ్ల హఫీజ్ సయీద్‌కు పలు సార్లు జైలు శిక్షలు పడ్డాయి. హఫీజ్‌కు ఇప్పటికే ఉన్న జైలు శిక్షను కలుపుకొంటే.. మొత్తం 68ఏళ్ల జైలు శిక్షను అతడు అనుభవించాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు 2020లో టెర్రర్ ఫండింగ్ కేసులో యాంటీ టెర్రర్ కోర్టు 15 ఏళ్లు జైలు శిక్ష విధించింది. హఫీజ్ సయీద్‌ ప్రస్తుతం లాహోర్‌ లోని కోట్‌ లఖ్‌ పట్‌ జైలులో ఉన్నాడని సమాచారం. ముంబై ఉగ్రదాడుల్లో ప్రధాన సూత్రధారి ఆరోపణలు ఎదుర్కొంటున్న హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలని కేంద్రం పలుమార్లు కోరినప్పటికీ పాక్‌ తిరస్కరిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Encounter, Jammu kashmir, Terrorists

తదుపరి వార్తలు