కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసుల మ‌ృతి

ఖమ్మం జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వాహనం ప్రమాదానికి గురైంది.

రాయచూర్ జిల్లా మాన్వి సమీపంలోకి రాగానే వీరి కారు అదుపుతప్పి బలంగా చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గోపాల్ అక్కడికక్కడే చనిపోయారు.

  • Share this:
    కర్ణాటకలోని రాయచూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఇద్దరు తెలంగాణ వాసులు మృతిచెందారు. పూర్తివివరాల్లోకి వెళితే.. గద్వాల జిల్లా కేటీ దొడ్డికి చెందిన గోపాల్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా బెంగళూరు నుంచి గురువారం ఉదయం కారులో సొంత గ్రామానికి బయలుదేరారు. రాయచూర్ జిల్లా మాన్వి సమీపంలోకి రాగానే వీరి కారు అదుపుతప్పి బలంగా చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గోపాల్ అక్కడికక్కడే చనిపోయారు. కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు మహిళలు సైతం తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన మహిళలను చికిత్స కోసం రాయచూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
    Published by:Narsimha Badhini
    First published: