హైదరాబాద్‌లో దారుణం.. బతికి ఉన్న పసిబిడ్డను పూడ్చిపెట్టే ప్రయత్నం

చనిపోయిన బిడ్డను తీసుకుని వెళ్లడానికి ప్రజారవాణాలో ఒప్పుకోరు కాబట్టి.. ఇక్కడ పాతిపెడుతున్నామని చెప్పారు. అయితే, పసిబిడ్డ కదులుతూ ఉండడాన్ని పోలీసులు గుర్తించారు.

news18-telugu
Updated: October 31, 2019, 8:14 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. బతికి ఉన్న పసిబిడ్డను పూడ్చిపెట్టే ప్రయత్నం
Video : బతికి ఉన్న పసిబిడ్డను పూడ్చిపెట్టే ప్రయత్నం.. ఓ తాత అమానుషం
  • Share this:
హైదరాబాద్‌లో దారుణం వెలుగుచూసింది. జూబ్లి బస్ స్టేషన్ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో ఓ పసిబిడ్డను పూడ్చిపెట్టేందుకు ఇద్దరు ప్రయత్నం చేశారు. అయితే, దీన్ని గమనించిన ఓ ఆటోడ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వగానే వారు వచ్చి ఆ ఇద్దరినీ పట్టుకున్నారు. ఆ పసిబిడ్డ బతికి ఉండగానే వారు పాతిపెట్టడానికి ప్రయత్నించినట్టు నిర్ధారించారు. ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో జూబ్లిహిల్స్ బస్టాండ్ సమీపంలోని నిర్మాణుష్య ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఓ బ్యాగ్‌లో పసిబిడ్డను పెట్టుకుని, పక్కనే గొయ్యి తొవ్వుతుండగా ఆటో డ్రైవర్ గుర్తించారు. వెంటనే సమీపంలో ఉన్న కానిస్టేబుల్ వెంకటరామకృష్ణకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అలర్ట్ అయిన రామకృష్ణ ఘటన స్థలానికి వెళ్లారు. అక్కడ కరీంనగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు పసిబిడ్డను గొయ్యిలో పాతిపెట్టడానికి ప్రయత్నం చేస్తుండటాన్ని గుర్తించారు. ఎందుకు అలా చేస్తున్నారని పోలీస్ కానిస్టేబుల్ ప్రశ్నించగా తాము కరీంనగర్‌కు చెందిన వారిమని, ఆ బిడ్డ తమ మనమరాలని చెప్పారు. రెండు రోజుల క్రితం ఓ ఆపరేషన్ విషలం కావడంతో చనిపోయిందని చెప్పారు. చనిపోయిన బిడ్డను తీసుకుని వెళ్లడానికి ప్రజారవాణాలో ఒప్పుకోరు కాబట్టి.. ఇక్కడ పాతిపెడుతున్నామని చెప్పారు. అయితే, పసిబిడ్డ కదులుతూ ఉండడాన్ని గమనించినపోలీస్ కానిస్టేబుల్ వెంటనే ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పసికందును గాంధీ ఆస్పత్రికి తరలించారు.First published: October 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...