• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • TWO SON LAW FELL WELL AND DEATH AT VIKARABAD DISTRICT VB

Telangana: విషాద ఘటన.. ఉగాది పండుగకు వచ్చిన అళ్లుళ్లను వెంటాడిన మృత్యువు.. ఒకరిని కాపాడబోయి మరొకరు ఊపిరాడక..

Telangana: విషాద ఘటన.. ఉగాది పండుగకు వచ్చిన అళ్లుళ్లను వెంటాడిన మృత్యువు.. ఒకరిని కాపాడబోయి మరొకరు ఊపిరాడక..

ప్రతీకాత్మక చిత్రం

ఉగాది పండుగకు అత్తారింటికి వచ్చిన ఇద్దరు అళ్లుళ్లను మృత్యువు వెంటాడింది. సరదాగా బావిలో ఈత కొడదామని వెళ్లిన వీరు ఒకరిని కాపాడబోయి మరొకరు నీట మునిగి చనిపోయారు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లాలోని తాండూరు మండలంలో చోటుచేసుకుంది.

  • Share this:
    ఉగాది పండుగకు అత్తారింటికి వచ్చిన ఇద్దరు అళ్లుళ్లను మృత్యువు వెంటాడింది. సరదాగా బావిలో ఈత కొడదామని వెళ్లిన వీరు ఒకరిని కాపాడబోయి మరొకరు నీట మునిగి చనిపోయారు.  పూర్తి వివరాల్లోకి వెళ్లే.. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం కొత్లాపూర్‌ గ్రామానిక చెందిన వడ్డె వెంకటప్ప, శ్యామప్ప అన్నదమ్ములు. కొత్లాపూర్‌కు చెందిన వెంకటప్ప కూతురు మాధవిని తాండూరు మండలం సిరిగిరిపేట్‌కు చెందిన కృష్ణ(31)కు ఇచ్చి వివాహం చేశారు. శ్యామప్ప కూతురు రేణుకను యాలాల మండలం గిరిజాపూర్‌కు చెందిన మహిపాల్‌(25) వివాహం చేసుకున్నాడు. కృష్ణ, మహిపాల్‌ కోత్లాపూర్‌ సమీపంలోని ఓ పాలిషింగ్‌ యూనిట్లో పనిచేస్తూ అక్కడే ఉండే వారు. కొన్నిరోజులుగా పనులు లేక ఖాళీగా ఉన్నారు. ఉగాది పండుగ కోసం కృష్ణ, మహిపాల్‌ కుటుంబాలు 2 రోజుల క్రితం కొత్లాపూర్‌కు వచ్చాయి.  అయితే మల్కాపూర్‌ గ్రామంలో ఓ పాలిషింగ్‌ యూనిట్‌ యజ మాని వద్ద పని మాట్లాడేందుకు కుటుంబీకులతో కలసి వెళ్లారు. సోమవారం నుంచి పనికి వస్తామని యజమానికి చెప్పారు.

    ఆనందంతో ఇద్దరు సరదాగా కల్లు తాగుదామని వనానికి వెళ్లారు. కల్లు తాగిని తర్వాత పక్కనే వ్యవసాయ పొలం వద్ద ఉన్న బావి వద్దకు వెళ్లారు. ఎండాకాలం ఉక్క పోత అధికంగా ఉండటంతో ఈత కొడదామాని అనుకున్నారు. కానీ అందులో మహిపాల్ కు ఈత రాదు. అయినా అతడికి ఒక డబ్బాను వీపు వెనుక తగిలించి బావిలో ఈత కొట్టేందుకు పంపారు. కాసేపు బాగానే బావిలో ఉన్న మహిపాల్ ఒక్కసారిగా మునిగిపోయాడు. గమనించిన తోటి సోదరుడు కృష్ణ కాపాడేందుకు బావిలో దుకాడు. ఇద్దరు కల్లు మత్తులో ఉండగా మహిపాల్ ను కాపాడబోయి కృష్ణ కూడా నీటిలో మునిగాడు. వారితో పాటు అక్కడకు వచ్చిన వాళ్ల బావమరిది నర్సింహులు గమనించి గ్రామంలోని కుటుంబీకులకు సమాచారం అందించాడు.

    సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మోటార్లతో నీటిని తోడి మహిపాల్, కృష్ణ మృతదేహాలను బయటకు తీశారు. కృష్ణకు భార్య మాధవి, పిల్లలు అరవింద్‌ (7), భాగ్యశ్రీ (4) ఉన్నారు. మహిపాల్‌కు భార్య రేణుక, కూతురు అశ్విని (2) ఉన్నారు. బతుకుదెరువు కోసం వచ్చిన కృష్ణ, మహిపాల్‌ మృతిచెందడంపై కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. దీంతో కొత్లాపూర్ గ్రామంలో ఒకే కుబుంబానికి చెందిన అన్నదమ్ముళ్ల అళ్లుళ్లు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుబుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
    Published by:Veera Babu
    First published: