ఓవ్యక్తి అదృశ్యమై రెండు వారాలు దాటుతోంది. ఇంట్లోంచి వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు. ఏమయ్యాడు ? ఎటు వెళ్లాడో అర్ధం కాని కుటుంబ సభ్యులు అతని ఆచూకి కోసం వెదుకుతూనే ఉన్నారు. 15రోజుల తర్వాత (After 15 days)పాడుబడ్డ బావి(Well)లో ఓ శవం(Dead body)కనిపించింది. మృతదేహం ఎవరికి..బావిలో ఎందుకుందని పోలీసులు విచారించడంతో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఉత్తరప్రదేశ్(Uttar pradesh)లో జరిగిన ఈదారుణం సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉంది. బావిలో పడి చనిపోయిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు మృతుడు బలరాంపూర్(Balarampur) రామానుజ్గంజ్ (Ramanujganj)ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు పోలీసులు. సరిగ్గా డిసెంబర్ (December)26న కనిపించకుండా పోయిన వ్యక్తి కూడా ఇతనేనని తేల్చారు. అక్కడి నుంచి విచారణ ముమ్మరం చేసిన పోలీసులు ఆ యువకుడ్ని ఇద్దరు చెల్లెళ్లే హత్య చేసి బావిలో పడేశారని నిర్ధారించారు. ఇంకా ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే ..మృతుడు ఇద్దరు చెల్లెళ్లతో ప్రేమవ్యవహారం (Love affair with these two sisters)కొనసాగిస్తున్నాడు. అంతే కాదు మృతుడు వీళ్లద్దరికి తెలియకుండా దూరపు బంధువుల అమ్మాయికి దగ్గరయ్యాడని తెలుసుకున్న ఈ ఇద్దరు మహిళలు ..అతడ్ని ఎలాగైనా అంతమొందించాలని పథకం వేసుకున్నారు. అందులో భాగంగానే ..వీళ్లే కాకుండా మరో సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న ఇద్దరు చెల్లెళ్లు ముఖేష్ మరావి (Mukesh maravi)అనే వ్యక్తిని హతమార్చి మూడో కంటికి తెలియకుండా తీసుకెళ్లి మృతదేహాన్ని బావిలో పడేసినట్లుగా పోలీసులు జనవరి(January)3వ తేదిన గుర్తించారు.
వావి లేదు వరస లేదు..
ముఖేష్ మరాని మృతదేహాన్ని బావిలోంచి బయటకు తీసిన పోలీసులు..కుటుంబ సభ్యుల్ని విచారించారు. అయితే మృతుడు తన ఇద్దరు సోదరిమణులతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లుగా నిర్ధారించారు. వాళ్లను తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో అసలు నిజం బయటపెట్టారు ఇద్దరు మహిళలు. మృతుడు తమతో పాటు మరో మహిళతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతోనే హతమార్చామని ఇద్దరు మహిళలు అంగీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు అక్కచెల్లెళ్లను విచారిస్తున్నారు.
అక్రమ సంబంధం కోసం అన్ననే హతమార్చారు..
శారీరక సుఖం కోసం అక్రమ సంబంధం ముసుగులో రక్తసంబంధాలు, వావివరసలు మర్చిపోతున్నారు కొందరు మూర్ఖులు. ఇలాంటి నిజాలు బయటకుతెలిసినా..లేదంటే తమకు ఇష్టమైన వ్యక్తులు మరొకరితో చనువుగా ఉన్న తట్టుకోలేక దారుణాలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ దారుణ ఘటన చూసి పోలీసులే ఇలాంటివి కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపోతున్నారు. నేరం చేసిన మహిళలు ఇద్దర్నిజైలుకు పంపారు ఉత్తరప్రదేశ్ పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.