• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • TWO SISTERS GANGRAPED THREATENED BY FOUR MEN IN RAJASTHAN SU

ఇద్దరు అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్.. ఓ ఇంటికి తీసుకెళ్లి దారుణం.. నిందితుల్లో ఇద్దరు..

ప్రతీకాత్మక చిత్రం

ఇద్దరు యువతులపై నలుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతులను దారుణంగా కొట్టిన నిందితులు.. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు.

  • Share this:
    దేశంలో నిత్యం ఏదో ఓ చోట మహిళలు, బాలికపై దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా కాలంలో కూడా కామాంధులు.. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలను ఆపడం లేదు. ఇలా మహిళలపై నేరాలకు పాల్పడుతున్న కేసుల్లో.. చాలా వరకు వారికి పరిచయం ఉన్నవారే కావడం ఆందోళన కలిగించే విషయం. తాజాగా ఇద్దరు యువతులపై నలుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతులను దారుణంగా కొట్టిన నిందితులు.. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాళ్లు ఇద్దరు అక్కాచెల్లెళ్లు. ఈ షాకింగ్ ఘటన రాజస్తాన్‌లోని జైపూర్ జిల్లా లూనియావాస్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాళ్లు ఇద్దరు బుధవారం ప్రతాప్ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకోవడానికి గాలింపు చేపట్టారు.

    వివరాలు.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. వారిలో ఒకరి వయసు 19 ఏళ్లు కాగా, మరోకరి వయసు 20 ఏళ్లు. వీరిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు వ్యక్తులు బాధితురాళ్లకు తెలిసినవారే. జూన్ 1వ తేదీన బాధితురాళ్లతో పరిచయం ఉన్న అటల్, పంకజ్‌లు.. లూనియావాస్‌లోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ అటల్, పంకజ్‌లు మరో ఇద్దరితో కలిసి ఇద్దరు యువతులను కొట్టారు. అనంతరం వారిపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పవద్దని నిందితులు బెదిరింపులకు పాల్పడ్డారు.

    Andhra Pradesh: పెళ్లి పేరుతో నమ్మించి నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్.. బాధితుల్లో పలువురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు

    ఇక, ఈ ఘటనకు సంబంధించి బాధిత యువతులు కుటుంబ సభ్యులకు వివరించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాధిత యువతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.
    Published by:Sumanth Kanukula
    First published: