Home /News /crime /

TWO SIBLINGS FROM KEESARA COMMITTED SUICIDE BECAUSE THEY COULD NOT BEAR THE DEATH OF THEIR MOTHER PRV

Sad Story: తల్లి చనిపోయిన 8 నెలలకు ఇల్లు శుభ్రం చేయడానికి లోపలికి వెళ్లిన సోదరులు.. ఆ తర్వాత బయటికి రాలేదు.. అసలేం జరిగింది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అల్లారు ముద్దుగా చూసుకున్న తల్లి కేన్సర్​తో చనిపోయింది. మనోవేదనతోనే ఇద్దరు అన్నదమ్ములు పట్నం వచ్చి ఏదో ఒక పని చేసుకుందాం అనుకున్నారు. కానీ, తల్లి ఎడబాటును భరించలేకపోయారు. కఠిన నిర్ణయం తీసుకున్నారు.

    ఆ అన్నదమ్ములిద్దరికీ (Siblings) తల్లితో అనుబంధం ఎక్కువ. ఇంట్లో అమ్మ లేకపోతే వారికి ఏమీ తోయదు. అలాంటి ఇద్దరి అన్నదమ్ముల జీవితంలోనుంచి ఒక్కసారిగా తల్లి శాశ్వతంగా దూరమైంది. అంతే ఆ ఘటనే వారిద్దరి జీవితాలను అగాధంలోకి నెట్టింది. ఇద్దరు యువకులైనా.. ఎలా బతకాలో తెలియకో.. తల్లి లేని బతుకులు ఎందుకు అనుకున్నారో కానీ.. కఠిన నిర్ణయం తీసుకున్నారు. తల్లి మృతిని తట్టుకోలేక ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు (Siblings suicide) పాల్పడ్డారు. రంగారెడ్డిలోని కీసర (Keesara) పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాంపల్లిదాయర గ్రామంలో ఈ ఘటన జరిగింది. కీసర సీఐ రఘువీర్‌రెడ్డి కథనం ప్రకారం గ్రామానికి చెందిన సుశీల భర్త మరో వివాహం చేసుకొని ఇంటినుంచి వెళ్లిపోవడంతో తన ముగ్గురు పిల్లలతో కలసి ఉంటోంది.

    వారానికోసారి తల్లి వద్దకు వచ్చి..

    ఇటీవల పెద్ద కుమారుడు మాధవరెడ్డి (Madhavareddy)కి వివాహం కాగా అతని భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది. అప్పటినుంచి ఆయన గండిపేటలో ప్రైవేటు ఉద్యోగంచేస్తూ అక్కడే ఉంటున్నారు. అతని సోదరులు 30 ఏళ్ల యాదిరెడ్డి (Yadhireddy) , 28 ఏళ్ల  మహిపాల్‌రెడ్డి (mahipal Reddy) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ మ్యూజిక్​ స్కూల్​ (Music School)లో పని చేస్తున్నారు. వారానికోసారి తల్లి వద్దకు వచ్చివెళ్లేవారు. కాగా, వీరి తల్లి సుశీల క్యాన్సర్​ వ్యాధితో  ఎనిమిది నెలల క్రితం మృతిచెందింది.



    Crime news: వీళ్ల రూటే సపరేటు.. దొంగతనానికి వెళ్లి ఆ ఒక్క పరికరమే కొట్టేస్తారట.. ఎందుకో తెలుసా?

    మాతృమూర్తి చనిపోయిన తర్వాత ఇంటిని వదిలేసి హైదరాబాద్​లోని  దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లిపోయారు ఇద్దరు సోదరులు. అయితే యాదిరెడ్డి, మహిపాల్‌రెడ్డి ఈనెల 21న ఇంటిని శుభ్రం చేసేందుకు రాంపల్లిదాయరకు వచ్చారు. ఈ క్రమంలో గండిపేటలో ఉన్న అన్న మాధవరెడ్డి తన సోదరులకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా సమాధానం ఇవ్వలేదు. దీంతో ఏదో కీడు శంకించిన పెద్ద సోదరుడు పక్కింటి వారికి ఫోన్‌చేసి విషయం చెప్పారు.

    Crime News: డ్వాక్రా లోన్​ తీసుకోవద్దన్న భార్య.. ఆర్థిక ఇబ్బందులతో చేయకూడని పని చేసిన భర్త..

    వారు వెళ్లి కిటికిలో నుంచి చూడగా యాదిరెడ్డి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఉండటం, మహిపాల్‌రెడ్డి పురుగు మందుతాగి కిందపడి ఉండటం గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులకు ఇంట్లో డెడ్​బాడీలను పరిశీలించారు. మృతులు రాసిన సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అందులో తమ తల్లి చనిపోవడం తట్టుకోలేక మానసిక వ్యధతో ఆత్మహత్య చేసుకుంటున్నామని రాసి ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కీసర పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Keesara, Rangareddy, Suicide

    తదుపరి వార్తలు