TWO RTC BUSES COLLIDED HEAD ON WITH A PASSING TWO WHEELER IN NIRMAL DISTRICT AND INJURING SEVERAL PASSENGERS SLIGHTLY PRV
Nirmal: బైకును తప్పించబోయి రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. ఖానాపూర్‌లో ఘటన.. ఆసుపత్రికి క్షతగాత్రులు
ప్రతీకాత్మకచిత్రం
ముందు వెళుతున్న ద్విచక్రవాహనం తప్పించబోయి ఓ ఆర్టీసీ బస్సు సడెన్‌గా బ్రేక్ వేసింది. అయితే వెనకాలే వేగంగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సు ఒక్క సారిగా కంట్రోల్ కాకపోవడంతో ముందున్న బస్సును ఢీకొట్టింది.
ముందు వెళుతున్న ద్విచక్రవాహనం (Two wheeler) తప్పించబోయి ఓ ఆర్టీసీ బస్సు (RTC Bus) సడెన్‌గా బ్రేక్ వేసింది. అయితే వెనకాలే వేగంగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సు ఒక్క సారిగా కంట్రోల్ కాకపోవడంతో ముందున్న బస్సును ఢీకొట్టింది (Collied). ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు (Slightly injured) అయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఆర్టీసీ బస్సు నిర్మల్ (Nirmal) పట్టణం నుంచి జగిత్యాల వెళ్తోంది. అయితే ఈ బస్సుకు ముందు భాగంలో ఇద్దరు యువకులు ద్విచక్రవాహనం తీసుకొని వెళ్తున్నారు. ఒక బైక్ చెడిపోవడంతో దానికి తాడు కట్టి మరో బైక్ సాయంతో ప్రయాణం కొనసాగిస్తున్నారు. అయితే ఖానాపూర్ సిటీ శివారులోని కుమురం భీం చౌరస్తా వద్దకు చేరుకోగానే ఓ యువకుడు (Younger) నడుపుతున్న ద్విచక్రవాహనం అదుపుతప్పింది. దీంతో అతడు కింద పడిపోయాడు. దీనిని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై, ఆ యువకుడిని కాపాడేందుకు బస్సును నిలిపివేశారు.
ఇదే సమయంలో వెనకాలే నిర్మల్ నుంచి ఖానాపూర్ (Khanapur) వస్తున్న మరో ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఈ బస్సును వెనకాల నుంచి ఢీ కొట్టింది. ఈ రెండు బస్సులు ఢీకొట్టిన సమయంలో (At the time collied) బస్సులో మొత్తం 150 మంది (Passengers)కి పైగా ఉన్నారు. ఒక్క సారిగా ఒక ఈ ఘటన చోటు చేసుకోవడంతో బస్సుల్లో ఉన్న 30 మంది గాయపడ్డారు. అదృష్టవశాత్తు ఎక్కువ మందికి గాయాలు కాలేదు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరినీ అందుబాటులో ఉన్న ప్రైవేట్ వాహనాలు, 108 ఆంబులెన్స్ లు, ఆటోల ద్వారా ఖనాపూర్ లో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం వారంతా అక్కడ చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వనస్థలిపురం సమీపంలో..
ఇటీవలె హైదరాబాద్‌లోని వనస్థలిపురం సమీపంలోని బీఎన్‌రెడ్డి నగర్ సాగర్ రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొట్టాయి. ఇబ్రహీంపట్నం నుంచి జేబీఎస్ వెళ్లే బస్సులు(రూట్ నం.279) అదుపుతప్పి ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. వీటిలో ఓ బస్సు ఇబ్రహీంపట్నం, మరో బస్సు మిథాని డిపోలకు చెందినవి. మధ్యాహ్నం సాగర్ రహదారిపై అతివేగంగా ప్రయాణించిన ఓ కారు అదుపుతప్పి సడెన్ బ్రేక్ వేసింది.
దీంతో దాని వెనుకాల వెళ్లున్న ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన బస్సు డ్రైవర్ బ్రేక్ వేయగా.. ఆ వెనకాలే వస్తున్న మిథానీ డిపోకు చెందిన బస్సు స్పీడ్ కంట్రోక్ కాక ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇబ్రహీంపట్నం డిపో బస్ డ్రైవర్, కండక్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రెండు బస్సుల్లో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాద సమయంలో రెండు బస్సుల్లో కలిపి 60 మంది ప్రయాణికులున్నారు. పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.