Home /News /crime /

TWO ROAD ACCIDENTS KILLED FOUR MEMBERS WHO BELONG TO SAME FAMILIES IN EAST GODAVARI DISTRICT FULL DETAILS HERE HSN

Road Accident: రెండు కుటుంబాలను వెంటాడిన మృత్యువు.. యాక్సిడెంట్లో ఒకరి మృతి.. చూసేందుకు ఆస్పత్రికి ఆటోలో నలుగురు వెళ్తోంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రోడ్డు ప్రమాదాలు ఆ రెండు కుటుంబాలను వెంటాడాయి. ఓ వ్యక్తి రోడ్డుప్రమాదానికి గురయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చూసేందుకు వెళ్తున్న బంధువులను కూడా రోడ్డు ప్రమాదం వెంటాడింది. చివరకు..

    ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండ్రోజుల తర్వాత మరణించాడు. శవ పంచనామా నిమిత్తం అతడి బంధువులు ఆస్పత్రికి బయలుదేరారు. అయితే ఊహించని రీతిలో వాళ్లు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురయింది. ఆ ఆటోను ఓ టిప్పర్ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఓ ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో మరణించాడు. చనిపోయన వాళ్లంతా అన్నదమ్ముల కుటుంబానికి చెందిన వారే కావడం గమనార్హం. అందరిదీ ఒకే ఊరు కూడా. నాలుగు రోజుల వ్యవధిలోనే ఒకే ఊరికి చెందిన అన్నదమ్ముల కుటుంబంలో నలుగురు వ్యక్తులు మరణించడంతో బంధువుల్లో విషాధ ఛాయలు నెలకొన్నాయి. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    తూర్పు గోదావారి జిల్లా గొల్లప్రోలు మండలం ఏపీ మల్లవరం గ్రామానికి చెందిన కడిమిశెట్టి భాస్కర్ రెడ్డి ఏప్రిల్ 3వ తారీఖున ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తొండంగి సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో భాస్కర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఏప్రిల్ 5వ తారీఖున అతడు మరణించాడు. అయితే శవ పంచనామా నిమిత్తం భాస్కర్ రెడ్డి బంధువులు కడిశెట్టి తాతిరెడ్డి, సూర్రెడ్డి, వీరేంద్ర కుమార్, కృష్ణారెడ్డి కలిసి ఆటోలో కాకినాడకు బయలుదేరారు. నలుగురూ కలిసి ఆటోలో వెళ్తుండగా అంతలోనే ఘోరం జరిగిపోయింది.

    పండూరు సెంటర్ వద్ద వాళ్లు ప్రయాణిస్తున్న ఆటోను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో సూర్రెడ్డి, వీరేంద్రకుమార్ అక్కడికక్కడే మరణించారు. చికిత్స పొందుతూనే బుధవారం తాతిరెడ్డి కూడా చనిపోయాడు. రోజుల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు చనిపోవడం, వాళ్లంతా సొంత అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన వారే కావడం శోచనీయం. చనిపోయిన వారంతా ఒకే ఊరికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాధ చాయలు నెలకొన్నాయి. ఆ రెండు కుటుంబాలకు వచ్చిన కష్టాన్ని చూసి గ్రామస్తులంతా కన్నీటిపర్యంతమయ్యారు. విశాఖపట్టణంలో చదువుకునే వీరేంద్రకుమార్, బంధువు చనిపోయాడని గ్రామానికి వచ్చాడు. అలా వచ్చిన అతడు శవమై కనిపించాడని ఆవేదన వ్యక్తం చేశారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Car accident, Crime news, Crime story, CYBER CRIME, Road Accident

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు