Hyderabad Accidents: హైదరాబాద్ లో మూడు రోడ్డు ప్రమాదాలు..

Hyderabad Heavy Rains - Road Accidents: హైదరాబాద్ నగరంలో ఈ రోజు ఉదయం రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వర్షం కారణంగా రోడ్డు కనపడకపోవడంతో ఫార్చునర్ కార్ డివైడర్ ను ఢీ కొట్టింది. మరో ప్రమాదంలో భారీ ట్రక్ అదుపుతప్పింది.

news18-telugu
Updated: September 26, 2020, 11:37 AM IST
Hyderabad Accidents: హైదరాబాద్ లో మూడు రోడ్డు ప్రమాదాలు..
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు
  • Share this:
హైదరాబాద్ మహానగరాన్ని వరుణుడు వణికిస్తున్న విషయం తెలిసిందే. రోడ్లు, కాలనీల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు వర్షం కారణంగా ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ నుంచి సచివాలయం వైపు వెళ్తున్న ఫార్చూనర్ కారు ప్రమాదానికి గురైంది. ఎన్టీఆర్ గార్డెన్ రోడ్డుపై వరద నీరు భారీగా నిలిచింది. అదే సమయంలో కారు అద్దాలపై వర్షం చినుకులు పడడంతో డ్రైవర్ కు ముందు ఏమీ కనిపించలేదు. దీంతో కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. అయితే ప్రమాదంలో వారెవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన కారును అక్కడి నుంచి తొలగించారు.

తార్నకలో మరో ప్రమాదం..

తార్నాక ఫ్లై ఓవర్ పై మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్రగడ్డ నుంచి ఉప్పల్ వెళ్తున్న భారీ ట్రక్ ప్రమాదానికి గురైంది. అదుపు తప్పిన ట్రక్ ఫ్లై ఓవర్ డివైడర్ ను ఢీకొని దాన్ని దాటుకుని దూసుకెళ్లింది. మరోవైపున గోడను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదం ఉదయం నాలుగున్నరకు జరిగింది. ట్రక్కు డ్రైవర్ సాంబశివరావు నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రక్ ను ఫ్లై ఓవర్ నుంచి తప్పించేందుకు తీవ్రంగా శ్రమించారు. రెండు భారీ క్రేన్లను రప్పించి ట్రక్ ను ఫ్లై ఓవర్ పై నుంచి తొలగించారు. ఈ ఘటనతో చాలా సేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

అంబర్‌పేట్ మెయిన్‌రోడ్డు‌పై..
అటు హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ మెయిన్ రోడ్డుపై ఆటో వెళ్తుండగా భారీ వృక్షం దానిపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జుకాగా...అదృష్టవశాత్తు ఆటో డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు.

వర్షాల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు. రోడ్లపై వరద నీరు చేరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రోడ్లపై అతి ప్రమాదం తగదని సూచిస్తున్నారు. ద్విచక్రవాహనాలు స్కిడ్ అయ్యే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచిస్తున్నారు. అలాగే వర్షపు నీరు నిలిచి చోట్ల వాహనాలను నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Published by: Nikhil Kumar S
First published: September 26, 2020, 10:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading