శేషాచలంలో స్మగ్లర్స్ హల్‌చల్: ఇద్దరిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్!

దాదాపు రెండు రోజులపాటు నడుచుకుంటూ అడివిలోకి వెళ్లి.. అక్కడి నుంచి ఎర్రచందనం దుంగలను మోసుకుంటూ వస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

news18-telugu
Updated: October 18, 2018, 10:15 AM IST
శేషాచలంలో స్మగ్లర్స్ హల్‌చల్: ఇద్దరిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్!
పట్టుబడ్డ స్మగ్లర్స్..
news18-telugu
Updated: October 18, 2018, 10:15 AM IST
శేషాచలం అడవుల్లో కూంబింగ్‌కి వెళ్లిన టాస్క్‌ఫోర్స్ బృందం ఎర్రచందనం స్మగర్స్‌ను పట్టుకుంది. వారి వద్ద నుంచి 14 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. బుధవారం సాయంత్రం ఆర్ఎస్ఐ వాసు నేత్రుత్వంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు ఈ కూంబింగ్ నిర్వహించారు.

కూంబింగ్‌లో భాగంగా కళ్యాణి డ్యామ్ సమీపంలోని దెయ్యాల కోన వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. అధికారులకు అక్కడేదో అలికిడి వినిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు నైట్ విజన్ డివైజర్(ఎన్‌విడి)లను ఉపయోగించి స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దాదాపు 15-20మంది స్మగ్లర్లు అడవిలో సంచరిస్తున్నట్టు వారు ఓ అంచనాకు వచ్చారు.

అయితే టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కేవలం ఐదుగురు మాత్రమే ఉండటంతో.. కేవలం ఇద్దరిని మాత్రమే పట్టుకోగలిగారు. మిగిలిన స్మగ్లర్లు చేతిలో ఉన్న ఎర్రచందనం దుంగలను అక్కడే పడేసి పారిపోయారు. స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో ఓ కానిస్టేబుల్ స్వల్ప గాయాలపాలయ్యాడు. ఓ స్మగ్లర్ అతనిపై దాడికి దిగి గోళ్లతో రక్కి తప్పించుకున్నాడు. పట్టుకున్న స్మగ్లర్లను వేలూరు జిల్లా ఆనైకట్టు తాలూకా పనపార గ్రామానికి చెందిన కామరాజ్ ( తండ్రి పేరు వెల్లయన్), శేఖర్ ( తండ్రి- చిన్నస్వామి)లుగా గుర్తించారు.

దాదాపు ఆరు రోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం వారు అడవిలోనే ఉన్నట్టు పోలీసులు నిర్దారించారు. జవ్వాది మలైకి చెందిన కుమార్ అనే మేస్త్రి తమను ఇక్కడికి తీసుకొచ్చాడని స్మగ్లర్స్ పోలీసులకు తెలిపారు. కిలోకి రూ.600 చొప్పున ఇస్తామని వారితో బేరం కుదుర్చుకున్నట్టు చెప్పారు.

First published: October 18, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...