Crime: లగ్జరీ బస్సులో ఘోరం.. మైనర్ బాలికపై అత్యాచారం.. ఆ పనికి సహకరించిన తన సోదరి..

ప్రతీకాత్మక చిత్రం

Crime: దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజు ఎదో ఒక చోట ఇలాంటి దారుణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ మైనర్ బాలిక పై ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన అందరిని కలచివేసింది. అలాంటి తప్పు మరెవ్వరూ చేయకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకొచ్చింది. కానీ కామంతో కళ్లు మూసుకుపోయిన వాళ్లు ఇవన్ని లెక్కచేయడం లేదు. ఎన్ని శిక్షలు విధించినా ఆ మృగాళ్లల్లో మార్పు మాత్రం రావడం లేదు. చిన్నా, చితక, ముసలి, ముతక అన్న తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల ముసలవ్వ వరకూ ఎవ్వరినీ వదలడం లేదు. ఇలా ఎదో ఒక చోట లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ లో ఓ మైనర్ బాలికపై ఇద్దరు లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ పనికి తన సొంత సోదరి సహకరించడం విశేషం. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ఉత్తరప్రదేశ్‌లో సుల్తాన్‌పూర్‌ జిల్లాలో  పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా రాత్రి పోలీసులు సుల్తాన్‌పూర్‌లో ఓ లగ్జరీ బస్సును ఆపారు. అందులో తనిఖీ నిర్వహిస్తుండగా, చివరి సీటు కింద ముగ్గురు చిన్నారులను గుర్తించారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో అందులో ఓ అమ్మాయి (15)పై లైంగిక దాడి జరిపినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

  Read Also: మామ మాట తప్పాడని.. అల్లుడు ఆత్మహత్య.. అసలు విషయం ఏంటంటే..

  దీంతో అక్కడే ఉన్న బస్సును సీజ్ చేయడంతో పాటు బస్సు డ్రైవర్‌, ఓ బాలుడు, బాధితురాలి సవతి సోదరిని అరెస్టు చేశామని పోలీసు అధికారి బల్దీరాయ్‌ రాజారామ్‌ చౌదరీ తెలిపారు. వెంటనే పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం వాళ్ల తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆమెను వారికి అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
  Published by:Veera Babu
  First published: