Home /News /crime /

Attack on judge: జడ్జిపై దాడికి పాల్పడిన పోలీసులు.. న్యాయమూర్తి తలపై తుపాకి గురిపెట్టి అధికారి హెచ్చరికలు

Attack on judge: జడ్జిపై దాడికి పాల్పడిన పోలీసులు.. న్యాయమూర్తి తలపై తుపాకి గురిపెట్టి అధికారి హెచ్చరికలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బిహార్‌ (Bihar)లో న్యాయమూర్తిపై పోలీసు అధికారులు దాడి చేయడం సంచలనం రేకెత్తించింది. మధుబని జిల్లా ఝంజర్‌పూర్లో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి (ASJ) గురువారం విచారణ మధ్యలో ఉన్నప్పుడు ఇద్దరు పోలీసు అధికారులు అతడిపై దాడి చేశారు.

ఇంకా చదవండి ...
    కోర్టు హాలు (court hall)లో విచారణ జరుగుతున్న సమయంలోన్యాయమూర్తిపై పోలీసు అధికారులు దాడి చేయడం సంచలనం రేకెత్తించింది. బిహార్‌ (Bihar)లో మధుబని జిల్లా ఝంజర్‌పూర్లో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు (Jhanjharpur sub-divisional court) న్యాయమూర్తి (ASJ) గురువారం విచారణ మధ్యలో ఉన్నప్పుడు ముగ్గురు పోలీసు అధికారులు (Two police officials) ఆయనపై దాడికి పాల్పడ్డారు.  దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘోఘర్దిహ పోలీస్ స్టేషన్‌ (Ghoghardiha police station)లో విధులు నిర్వహిస్తున్నస్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) గోపాల్ ప్రసాద్, సబ్-ఇన్‌స్పెక్టర్ అభిమన్యు కుమార్ ఇద్దరూ ఒక కేసుకు సంబంధించి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే న్యాయమూర్తి అవినాశ్​ కుమార్‌ (Avinash Kumar)  విచారణ చేస్తున్న సమయంలోనే ఘటన జరిగింది.

    కోర్టు సిబ్బందిపై కూడా దాడి..

    పోలీసు అధికారులు విచారణ జరుగుతున్న కోర్టు హాలులోకి ప్రవేశించి న్యాయమూర్తి అవినాశ్​ కుమార్‌ తలపై తుపాకి గురిపెట్టారు. దాడికి ప్రయత్నించారు. అంతేకాదు న్యాయమూర్తిని (Judge) రక్షించేందుకు జోక్యం చేసుకున్న పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని కూడా వారు గాయపరిచారు. మీడియా కథనాల ప్రకారం న్యాయమూర్తి అవినాష్ కుమార్ తన తీర్పుల కారణంగా నిత్యం వార్తల్లో నిలిచేవారు. చాలా సందర్భాల్లో జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ (SP)కి వ్యతిరేకంగా తీర్పులిచ్చారు. చాలా సందర్భాల్లో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ (police department)ని హెచ్చరించారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని వారు ఇలా చేసి ఉంటారని పలువురు అభిప్రాయం వ్యక్తంచేశారు.

    తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ..

    పోలీసు అధికారులు అవినాష్ కుమార్‌పై దుర్భాషలాడారని సర్వీస్ రివాల్వర్‌ను కూడా ఉపయోగించారని ఝంఝార్‌పూర్ సబ్-డివిజనల్ కోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు డికె శర్మ (DK Sharma, president of lawyers association of Jhanjharpur sub-divisional court) అన్నారు. “తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వారు కుమార్‌ను బెదిరించారు. ఈ సంఘటన వెనుక కారణం ఇంకా తెలియదు, కాని పోలీసు అధికారులు దుర్భాషలాడుతున్నారు. సంఘటన తరువాత, మేం కుమార్ కోర్టు గదికి పరుగెత్తాం. అత్యున్నత స్థాయి జ్యుడీషియల్ అధికారి (judicial officer)ని పోలీసులు దుర్భాషలాడటం చాలా అభ్యంతరకరం’’ అని అన్నారు.



    రాత్రి 7 గంటల సమయంలో ప్రత్యేక విచారణ..

    నిర్ఘాంతపరిచిన ఈ ఘటనపై జస్టిస్‌ రంజన్‌ గుప్త (Justice ranjan Guptha), జస్టిస్‌ మొహిత్‌ కుమార్‌ షా (Justice Mohit Kumar shah)లతో కూడిన పట్నా హైకోర్టు ధర్మాసనం గురువారం రాత్రి 7 గంటల సమయంలో ప్రత్యేక విచారణ చేపట్టింది. ఈనెల 29వ తేదీకల్లా సీల్డు కవర్‌లో నివేదిక సమర్పించాలని డీజీపీ (DGP)కి ఆదేశాలు జారీ చేసింది.

    న్యాయ వ్యవస్థను అణిచివేసే ప్రయత్నం..

    ఈ ఘటనను బార్ అసోసియేషన్ (Bar association) ఝంఝార్‌పూర్ వైస్ ప్రెసిడెంట్ తీవ్రంగా ఖండించారు. ఇది న్యాయ వ్యవస్థను అణిచివేసే ప్రయత్నం అన్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ (District SP)పై కూడా ఆయన ప్రశ్నలు సంధించారు. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ (Trial) జరిపించాలని, లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు (Bar association lawyers) డిమాండ్‌ చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Attack, Bihar, Crime news, Police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు