వీరిద్దరూ మామూలోళ్లు కాదు.. భార్యల కోసం భారీ మోసం.. కానీ చివరకు ఏం జరిగిందంటే..

సస్పెండైన ఇద్దరు పోలీసులు

పోలీస్ కానిస్టేబుల్ దేవేంద్ర సింగ్, హెడ్ కానిస్టేబుల్ యధువీర్ సింగ్.. తమ భార్యలు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఊహించని విధంగా కుట్ర చేశారు.

 • Share this:
  రాజస్థాన్ రీట్ పరీక్ష(రాజస్థాన్ ఎలిజబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ టీచర్)‌ల్లో జరిగిన అవకతవకలు కలకలం రేపుతున్నాయి. తాజాగా సవాయ్ మాధోపూర్ జిల్లాలోని గంగాపూర్ నగరంలో ఇద్దరు పోలీసులు చేసిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే పోలీస్ కానిస్టేబుల్ దేవేంద్ర సింగ్, హెడ్ కానిస్టేబుల్ యధువీర్ సింగ్.. తమ భార్యలు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఊహించని విధంగా కుట్ర చేశారు. ఉదయం 10 గంటలకు పరీక్ష జరగనుండగా.. అంతకంటే ముందుగానే పరీక్ష పేపర్‌ను రాబట్టుకుని తమ భార్యలకు అందజేసి కాపీ కొట్టేందుకు కారణమయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల భార్యలతో పాటు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న 40 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు.

  మరోవైపు సస్పెండ్ చేసిన పోలీసుల మొబైల్ ఫోన్లలో రీట్ పేపర్లు ఉన్నాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారికి ఆ పేపర్లు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ పరీక్షకు సంబంధించిన అవకతవకలు మరికొన్ని చోట్ల కూడా వెలుగులోకి వచ్చాయి. పరీక్షల్లో సమాధానం చెప్పేందుకు వీలుగా ఒక అభ్యర్థి చెప్పుల్లో బ్లూటూత్‌ పరికరాన్ని ఫిక్స్ చేశారు. స్లిప్పర్ల అడుగుభాగంలో ఒక చిన్న బ్యాటరీ, సిమ్‌ కార్డు అమర్చి, పరీక్ష రాసేవారి చెవిలో ఎవరికి కనిపించకుండా చాలా లోపలికి బ్లూటూత్‌తో పనిచేసే ఒక మైక్రో ఇయర్‌ పీస్‌ ఫిక్స్‌ చేశారు. దీని ద్వారా అభ్యర్థులు జవాబులు వినగలుగుతారు అని పోలీసులు తెలిపారు.

  ఈ ముఠాకు చెందిన నలుగురిని బికనేర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. ఈ చెప్పులను విద్యార్థులకు రూ.6 లక్షల చొప్పున అమ్మినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీనికి సూత్రధారి సస్పెండైన సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ తుల్సిరామ్‌ కాలేర్‌ అని పోలీసులు గుర్తించారు. ఆయనను వెతికే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ తరహా కేసుల్లో ఆయన గతంలోనూ ఒకసారి అరెస్టు అయినట్టు తెలుస్తోంది.
  Published by:Kishore Akkaladevi
  First published: