Home /News /crime /

TWO PERSONS WERE KILLED WHEN A LORRY COLLIDED WITH A COUPLES BIKE WHILE THEY WERE TAKING A U TURN ON THE SANGAREDDY NANDED NATIONAL HIGHWAY PRV

Sangareddy U turn: బంధువుల ఇంటికి వెళుతుండగా దారి తప్పిపోయారు.. కానీ, ఓ యూ టర్న్​ వారి జీవితాలనే ముగించేసింది..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

టాలీవుడ్​ హీరోయిన్​ సమంత (Samantha) లీడ్​ రోల్​లో నటించిన యూ టర్న్ (U turn)​ అనే సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఓ చిన్న యూటర్న్ (U turn)​ వాహనదారుల ప్రాణాల్నే బలి తీసుకుంటుంది. నిజజీవితంలో అలాంటి యూటర్న్ ఇపుడు​ రెండు నిండు జీవితాలను చిదిమేసింది. 

ఇంకా చదవండి ...
    టాలీవుడ్​ హీరోయిన్​ సమంత (Samatha) లీడ్​ రోల్​లో నటించిన యూ టర్న్ (U turn)​ అనే సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఓ చిన్న యూటర్న్ (U turn)​ వాహనదారుల ప్రాణాల్నే బలి తీసుకుంటుంది. నిజజీవితంలో అలాంటి యూటర్న్ ఇపుడు​ రెండు నిండు జీవితాలను చిదిమేసింది.  ఈ ఘ‌ట‌న సంగారెడ్డి (Sangareddy) జిల్లా నారాయ‌ణఖేడ్ (Narayanakhed) మండ‌ల ప‌రిధిలో జ‌రిగింది. కామారెడ్డి (Kamareddy) జిల్లా నాగిరెడ్డిపేట మండ‌లం జ‌లాల్ పూర్ కు చెందిన బేగ‌రి ల‌క్ష్మ‌య్య (60), చిత్ర‌మ్మ (57) ఇద్ద‌రు భార్యాభ‌ర్తలు (Husband and wife). అయితే వారు శ‌నివారం బైక్ పై మనూరు  మండ‌లం తిమ్మాపూర్ (Timmapur)లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాల‌ని అనుకున్నారు. దీని కోసం బైక్ పై ప్ర‌యాణం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. సంగారెడ్డి - నాందేడ్ నేష‌నల్ హైవే (Sangareddy Nandhed national highway)పై జ‌ర్నీ మొద‌లు పెట్టారు. అయితే వారు త‌మ గ‌మ్యానికి బ‌దులుగా అనుకోకుండా నారాయ‌ణఖేడ్ మండ‌లం నిజాంపేట స‌మీపంలోని బ్రిడ్జిపైకి బైక్ (Bike on bridge)ను వెళ్ల‌నిచ్చారు. కొంత స‌మ‌యం త‌రువాత తాము దారి త‌ప్పామ‌ని (Missed route) గ‌మ‌నించుకున్నారు. దీంతో లక్ష్మ‌య్య బైక్ ను యూట‌ర్న్ తిప్పాల‌ని అనుకున్నాడు. ఇలా యూట‌ర్న్ (Sangareddy U Turn) తిప్పుతున్న స‌మ‌యంలో అటు నుంచి వేగంగా వ‌స్తున్న లారీ వీరి బైక్ ను ఢీకొట్టింది.

    అప్ప‌టికే ఫ‌లితం లేకుండా పోయింది...

    బైకు ప్ర‌మాదంలో (Bike Accident) భార్య చిత్ర‌మ్మ ఘ‌ట‌నా స్థ‌లంలోనే చ‌నిపోయారు. భర్త ల‌క్ష్మ‌ణ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్రమాదం జరిగిన అనంతరం దంపతులను స్థానికులు గ‌మనించారు.  పోలీసులకు ఫోన్​ చేశారు. వెంట‌నే హైవే అంబులెన్స్ (Highway ambulance) లో ఖేడ్ ఏరియా హాస్పిటల్ (khed Area Hospital) కు తీసుకెళ్లారు. కానీ అప్ప‌టికే ఫ‌లితం లేకుండా పోయింది. హాస్పిట‌ల్ కు తీసుకొచ్చే ముందే ఆయ‌న చ‌నిపోయారు డాక్ట‌ర్లు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. కేసు ద‌ర్యాప్తు నిర్వ‌హిస్తున్నామ‌ని ఎస్సై తెలిపారు.

    ఆలయ సమీపంలో బైక్‎పై వెళ్తున్న దంపతులను..

    అయితే హైదరాబాద్ (Hyderabad)​లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. చిలుకూరు (Chilukuru) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అభయాంజనేయ స్వామి ఆలయ (Anjaneya Temple) సమీపంలో బైక్‎ (Bike)పై వెళ్తున్న దంపతులను (Couples) లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా 9Wide died)..భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు (Police) ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితులది కోదాడ (Kodhada) మండలం దొరకుంట వాసులుగా పోలీసులు గుర్తించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bike accident, Couple died, Sangareddy

    తదుపరి వార్తలు