ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో ఆదివారం నాడు ఉదయం దారుణం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాఉరుసు గట్టు వద్ద ఖమ్మం బైపాస్ హంటర్ రోడ్డు (Khammam Bypass Hunter Road) ఫ్లై ఓవర్ (Fly over)పై నుండి కారు కింద పడింది., ఈ ఘటన (Road accident)లో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరణించిన వారిని దంపతులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రుడిని దగ్గరలోని ఎంజీఎం ఆసుపత్రికి (MGM Hospital) తరలించారు.
ఆటోను ఢీకొనడంతో ముగ్గురు మృతి..
ఇదే వరంగల్ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం (Warangal Accident) జరిగింది. వర్ధన్పపేట బొల్లికుంటలో ఆటోను గుర్తు తెలియని వాహానం ఢీకొట్టడంతో మరో ముగ్గురు మరణించారు. వరంగల్ జిల్లా బొల్లికుంట వద్ద ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ముగ్గురు దుర్మరణం (Died) చెందారు. మృతుల్లో డ్రైవర్‌తో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతులు వర్ధన్నపేటకు చెందిన కూరగాయల వ్యాపారులుగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ రోడ్లు రక్త సిక్తమయ్యాయి. మేడ్చల్ జిల్లా (Medchal )సూరారం వద్ద మరో ప్రమాదం జరిగింది. కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో డీసీఎం డ్రైవర్ మరణించాడు. డీసీఎం అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంచనా వేశారు. దీనిపై కేసులు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొత్తగూడెం జిల్లాలో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Kothagudem Road Accident)టేకులపల్లి మండలంలోనూ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బైక్‌ను బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన దాస్‌తండా సమీపంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు ఈ విషయాన్ని గమనించి, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతులు ఎర్రాయిగూడేనికి చెందిన హనుమంతు, స్వామిగా గుర్తించారు కొత్తగూడెం పోలీసులు.
ఈ మధ్యన వరంగల్‌లో రోడ్డుప్రమాదాలు ఎక్కువయ్యాయి. ఇంతకముందు హన్మకొండలోనూ ప్రమాదం జరిగింది. హన్మకొండ (Hanmkonda) జిల్లాలో రోడ్డు ప్రమాదం (Shocking Accident) చోటుచేసుకుంది. శాయంపేట మండలంలోని మాందారిపేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున కూలీలతో వెళ్తున్న ఆటో (Auto) ట్రాలీని ఇసుక లారీ (Lorry) ఢీకొట్టింది. ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు (Three women Spot dead) అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Car accident, Warangal