HOME »NEWS »CRIME »two persons illegal affair leads to suicide in srikakulam district hsn

ఓ జంట అక్రమ సంబంధం.. ఊరి చివర తోటలో కనిపించిన సీన్ చూసి బిత్తరపోయిన గ్రామస్తులు

ఓ జంట అక్రమ సంబంధం.. ఊరి చివర తోటలో కనిపించిన సీన్ చూసి బిత్తరపోయిన గ్రామస్తులు
ప్రతీకాత్మక చిత్రం

రైతులు, కూలీలు కొందరు తోటలో పనులకు వెళ్లారు. ఈ మధ్యాహ్నం వాళ్లు తిరిగొస్తుండగా ఓ తోటలోంచి కుక్కల అరుపులు వినిపించాయి. దీంతో అటుగా వెళ్లిన వారికి ఒళ్లు గగుర్బొడిచే సీన్ కనిపించింది ఆ తోటలోని ఓ చెట్టుకు ఓ జంట ఉరేసుకుని కనిపించింది. వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి, ఆ మృతదేహాలను దింపి పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి పంపించారు.

  • Share this:
    అది శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామం. ఆ గ్రామం చివర అన్నీ తోటలే. ఆ తోటల మీదుగా కొందరు రైతులు, కూలీలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో పెద్ద సంఖ్యలో పక్షలు, కుక్కల అరుపులు వినిపించాయి. దీంతో ఏమయిందా అన్న ఆతృతతో వారంతా అరుపులు వినిపించిన వైపుగా వెళ్లారు. ఓ తోటలోనికి వెళ్లి కుక్కల అరుపులు వినిపించిన చోటకు వెళ్లి చూస్తే వారికి షాకింగ్ సీన్ కనిపించింది. ఓ చెట్టుకు ఓ జంట ఉరేసుకుని ఉంది. ఇద్దరూ కలిసి ఒకే తాడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్లంతా బెంబేలెత్తిపోయారు. వెంటనే విషయం అంతా ఊళ్లో తెలియడం, పోలీసులకు సమాచారం అందడం జరిగిపోయాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి సమీపంలో పిట్టల సరియ అనే ఊరు ఉంది. ఆ గ్రామంలో పెద్ద సంఖ్యలో తోటలు కూడా ఉన్నాయి. సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత రైతులు తమ పనులను యథావిథిగా మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే రైతులు, కూలీలు కొందరు తోటలో పనులకు వెళ్లారు. ఈ మధ్యాహ్నం వాళ్లు తిరిగొస్తుండగా ఓ తోటలోంచి కుక్కల అరుపులు వినిపించాయి. దీంతో అటుగా వెళ్లిన వారికి ఒళ్లు గగుర్బొడిచే సీన్ కనిపించింది ఆ తోటలోని ఓ చెట్టుకు ఓ జంట ఉరేసుకుని కనిపించింది. వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి, ఆ మృతదేహాలను దింపి పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి పంపించారు.



    చెట్టుకు ఉరేసుకున్న వారిని ఇప్పిలి రాజేష్, పాలిన వేనమ్మలుగా గ్రామస్తులు గుర్తించారు. అయితే వారిద్దరూ భార్యాభర్తలేమీ కాదని గ్రామస్తులు వెల్లడించారు. అక్రమ సంబంధం వ్యవహారమే ఈ ఆత్మహత్యకు కారణమయి ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు. వారి అక్రమ సంబంధం వల్ల ఇరుకుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయనీ, ఈ కారణం వల్లనే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఘటనపై కేసును నమోదు చేసుకున్నామనీ, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.
    Published by:Hasaan Kandula
    First published:January 16, 2021, 18:13 IST

    टॉप स्टोरीज