Firing Warning: పెద్దపల్లి జిల్లాలో దారుణం... భూ వివాదంలో తుపాకీతో బెదిరింపులు

బొమ్మ తుపాకీ, బాధితుడు దేవయ్య

Firing Warning: ఈమధ్య తెలంగాణలో భూముల విషయంలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెడుతూ... కొత్త రెవెన్యూ చట్టం తెచ్చింది. అయినప్పటికీ కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారా?

  • Share this:
    అది పెద్దపల్లి జిల్లా... కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రం. అక్కడ నివసిస్తున్న నిదానపురం దేవయ్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అర్థరాత్రి ఉలిక్కిపడ్డాడు. ఇద్దరు వ్యక్తులు... అర్థరాత్రి ఆయన దగ్గరకు వచ్చి... గన్‌తో బెదిరించారు. "ఆ భూమిని మర్చిపో లేదంటే... కాల్చి చంపుతాం" అని బెదిరించారు. అప్పటికప్పుడు దేవయ్యకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వాళ్లు ట్రిగ్గర్ నొక్కిత తన పరిస్థితి ఏంటని భయపడ్డాడు. రాత్రివేళ పీడకలలా ఈ ఘటన జరిగింది. దేవయ్యను బెదిరించిన దుండగులు... మెల్లగా చెక్కేశారు. తెల్లారి ధైర్యం తెచ్చుకున్న దేవయ్య... పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు దేవయ్యను దుండగుల గురించి లోతుగా అడిగారు. ఎలా ఉంటారు, ముఖాలు ఎలా ఉంటాయి, గెడ్డాలు ఉంటాయా... ఇలా ప్రశ్నించారు. దేవయ్య చెప్పిన వివరాలతో... పోలీసులకు కొందరిపై అనుమానం వచ్చింది.

    పోలీసులు వేగంగా స్పందించి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వాళ్లను నాలుగు బాదగా... నిజం బయటపెట్టారు. ఆ గన్ ఎక్కడుందని అడిగితే... ఓ బొమ్మ తుపాకీ బయటకు తీశారు. ఇదేంటి... అంటే... దీనితోనే బెదిరించామని చెప్పారు. దీని వెనక ఎవరెవరు ఉన్నారో తెలుసుకుంటామంటున్నారు పోలీసులు.

    peddapalli news, telangana news, telugu news, telugu varthalu, crime news, crime case, new revenue act, పెద్దపల్లి జిల్లా వార్తలు, తెలుగు న్యూస్, తెలంగాణ న్యూస్, క్రైమ్ న్యూస్,
    బొమ్మ తుపాకీ, బాధితుడు దేవయ్య


    దేవయ్యకూ ఊళ్లో కొంత మందికి కొంతకాలంగా దేవయ్య భూమికి సంబంధించి వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఘటన జరిగినట్లు తెలిసింది. ఓవైపు ప్రభుత్వం ఒక్క అంగుళం భూమి కూడా అక్రమం అవ్వడానికి వీల్లేదంటూ... సరికొత్త సాఫ్ట్ వేర్ తెస్తుంటే... మరోవైపు ఊళ్లలో ఇలా బెదిరింపులకు పాల్పడుతూ... భూముల్ని ఆక్రమించుకోవడానికి యత్నిస్తున్నారు అక్రమార్కులు.
    Published by:Krishna Kumar N
    First published: