TWO PERSONS HAVING ILLEGAL AFFAIR WITH WOMAN ONE KILLED BY ANOTHER PERSON IN TELANGANA AK
Illegal affair: వివాహేతర సంబంధం.. యువకుడి హత్య.. మద్యం మత్తులో బయటికొచ్చిన నిజం
ప్రతీకాత్మక చిత్రం
Illegal Affair: తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతితో మరో యువకుడు సంబంధం పెట్టుకోవడాన్ని తట్టుకోలేకపోయిన వ్యక్తి.. యువకుడిని అతి దారుణంగా హత్య చేశాడు.
తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో మరో యువకుడు సంబంధం పెట్టుకోవడాన్ని తట్టుకోలేకపోయాడు ఆ వ్యక్తి. పారిపోయిన తన ప్రియురాలి, ఆమె ప్రియుడిని పట్టుకుని తీసుకొచ్చాడు. అతడిని బంధించి చిత్రహింసలు పెట్టాడు. ఈ క్రమంలోనే అతడు చనిపోయాడు. మూడో కంటికి తెలియకుండా అతడి మృతదేహాన్ని స్మశానంలో పూడ్చిపెట్టాడు. ఆ నిజం కూడా సమాధి అయిపోయిందని భావించాడు. అయితే నిజం నిప్పులాంటిది. అది ఎలాగైనా బయటకు వస్తుంది. యువకుడి హత్యకు సంబంధించిన నిజం.. అతడి నోటి నుంచే బయటకు వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన వ్యాపారవేత్త కనకరాజుకు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే అదే యువతి శ్రీకాంత్ రెడ్డి అనే మరో యువకుడిని ప్రేమించింది. కొన్ని నెలల క్రితం ఆ యువతిని శ్రీకాంత్ రెడ్డి బయటకు తీసుకెళ్లడంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ విషయంలో శ్రీకాంత్ రెడ్డిపై పగ పెంచుకున్న కనకరాజు.. కొద్దిరోజుల క్రితం యువతితోపాటు శ్రీకాంత్ రెడ్డిని తీసుకొచ్చాడు. ఇద్దరినీ జవహర్‌నగర్‌లోని ఓ ఇంట్లో బంధించాడు.
పది రోజుల పాటు శ్రీకాంత్‌రెడ్డిని హింసించాడు. ఆ తరువాత అతడిని చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని శ్మశానవాటికలో పూడ్చిపెట్టాడు. అయితే ఈ విషయం కనకరాజు బయటకు చెప్పేవరకు ఎవరికీ తెలియలేదు. మద్యం మత్తులో కనకరాజు ఈ విషయాన్ని తన మిత్రులకు చెప్పడంతో... ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శ్మశానానికి వెళ్లి పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసు సమక్షంలో శ్రీకాంత్‌రెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.