హోమ్ /వార్తలు /క్రైమ్ /

Friends cheated: దీనమ్మ జీవితం.. ఫ్రెండ్​షిప్​ డే అంటూ ముగ్గురు వచ్చారు.. కట్​ చేస్తే రూ.75 లక్షలు మాయం..

Friends cheated: దీనమ్మ జీవితం.. ఫ్రెండ్​షిప్​ డే అంటూ ముగ్గురు వచ్చారు.. కట్​ చేస్తే రూ.75 లక్షలు మాయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గోవా నుంచి వచ్చిన తన ఫ్రెండ్ పబ్​కు వెళ్దామంటే ఓ వ్యాపారి​ సరదాగా తీసుకెళ్లాడు. అక్కడ పాత ఫ్రెండ్​ కలిస్తే ఇద్దరూ అతనితో మాట కలిపారు. ఇంతలో తన ఫ్రెండ్​ అంటూ అతడు మరో వ్యక్తిని పరిచయం చేశాడు. కట్​ చేస్తే 75 లక్షలు మాయం.

  ఓ రియల్​ ఎస్టేట్​ వ్యాపారి (Real estate Business man).. గోవా నుంచి వచ్చిన తన ఫ్రెండ్ పబ్​కు వెళ్దామంటే​ సరదాగా తీసుకెళ్లాడు. అక్కడ పాత ఫ్రెండ్​ కలిస్తే ఇద్దరూ అతనితో మాట కలిపారు. ఇంతలో తన ఫ్రెండ్​ అంటూ అతడు మరో వ్యక్తిని పరిచయం చేశాడు. ఫ్రెండ్​కి ఫ్రెండ్​ అంటే మనకూ ఫ్రెండే అనుకుంటూ నలుగురూ కలిసి అర్ధరాత్రి దాకా పబ్​లో గడిపారు. అనంతరం స్థిరాస్తి వ్యాపారి ఇంటికొచ్చి.. మందు పార్టీ మొదలెట్టారు. కట్​చేస్తే.. వ్యాపారి ఇంట్లోని బ్యాగులో ఉండాల్సిన రూ.75 లక్షలు మాయమయ్యాయి. ఈ సంఘటన శనివారం హైదరాబాద్​లోని మలక్‌పేట (Malak pet) పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

  పోలీసులు తెలిపిన వివరాలు.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సాయిప్రకాశ్‌రెడ్డి (Sai Prakash reddy) మూసారంబాగ్‌ డివిజన్‌ సలీంనగర్‌ పద్మావతి రెసిడెన్సీలో ఉంటున్నాడు. గోవాలో ఉంటున్న అతని ఫ్రెండ్‌ ఫిరోజ్‌ ఈనెల 29న సలీంనగర్‌కు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఇంట్లో మద్యం సేవించారు. తరువాత ఫిరోజ్‌ పబ్‌కి వెళ్దామని అంటే రాత్రి 10 గంటలకు కొత్తపేటలోని ఓ పబ్‌కి వెళ్ళారు. పబ్‌లో పాత ఫ్రెండ్‌ రాజేష్‌ కలిశాడు. రాత్రి 1.30 గంటలకు ఫిరోజ్, రాజేష్‌, రాజేష్‌ స్నేహితుడు నలుగురు కలిసి మద్యం తాగడానికి సలీంనగర్‌లొని సాయిప్రకాశ్​ రెడ్డి ఇంట్లోకి వచ్చారు. ఫిరోజ్‌ ఒక గదిలో పడుకున్నాడు. మిగిలిన ముగ్గురూ కలిసి హాల్లో మద్యం తాగుతుండగా.. రాజేష్‌ నిద్రవస్తుందని చెబితే సాయిప్రకాశ్‌రెడ్డి అతనిని మరొ గదిలోకి తీసుకెళ్లి పడుకోమని చెప్పి వాష్‌రూమ్‌కు వెళ్లాడు. వాష్‌ రూం నుంచి బయటికి వచ్చేసరికి మంచంపై ఖాళీ బ్యాగు పడి ఉండటాన్ని గమనించాడు సాయిప్రకాశ్​ రెడ్డి.

  రాజేష్‌, అతని ఫ్రెండ్‌ ఇంట్లో లేరు. ఇంట్లో పెట్టిన రూ. 75 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ కన్పించలేదు. వెంటనే కిందకి వెళ్లి చూడగా రాజేష్‌ కనిపించాడు. అతన్ని ఆపి అడుగుతుండగా గేట్‌ దూకి పారిపోయాడు.

  దీంతో వెంటనే మలక్​పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు సాయిప్రకాశ్​ రెడ్డి. భూమి అమ్మిన రూ.75 లక్షలు నల్లరంగు బ్యాగులో ఉండగా రాజేష​ రాజేష్‌ ఫ్రెండ్‌ దొంగతనం చేశారని  సాయిప్రకాశ్‌రెడ్డి శనివారం మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Friendship, Hyderabad

  ఉత్తమ కథలు