• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • TWO PERSONS ARRESTED DUE TO BLACKMAIL AND RAPED A GIRL WHILE SHE WAS ALONE WITH BOY FRIEND IN FOREST IN MULUGU DISTRICT HSN

స్నేహితురాలిని తీసుకుని బైక్‌పై అటవీ ప్రాంతాన్ని చూసేందుకు వెళ్లిన కుర్రాడికి చేదు అనుభవం.. వాళ్లిద్దరూ ఒంటరిగా ఉన్న సమయంలో..

స్నేహితురాలిని తీసుకుని బైక్‌పై అటవీ ప్రాంతాన్ని చూసేందుకు వెళ్లిన కుర్రాడికి చేదు అనుభవం.. వాళ్లిద్దరూ ఒంటరిగా ఉన్న సమయంలో..

ప్రతీకాత్మక చిత్రం

ఓ యువకుడు తన స్నేహితురాలితో కలిసి ఆ అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అటవీ ప్రాంతంలో ఒంటరిగా ఉన్న వారిద్దరినీ ఓ ఇద్దరు వ్యక్తులు చూశారు. అంతే వారిలో ఓ దారుణమైన ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని అమలు చేశారు కూడా..

  • Share this:
    ఓ యువకుడు తన స్నేహితురాలితో కలిసి పర్యాటక ప్రాంతం చూసేందుకు బైక్ పై వెళ్లాడు. అటవీ ప్రాంతంలో ఒంటరిగా ఉన్న వారిద్దరినీ ఓ ఇద్దరు వ్యక్తులు చూశారు. అంతే వారిలో ఓ దారుణమైన ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని అమలు చేశారు కూడా. వాళ్ల వద్దకు వెళ్లి బెదిరించారు. వీడియో తీస్తూ నానా మాటలు అన్నారు. ఆ కుర్రాడి వద్ద నుంచి ఫోన్ ను లాగేసుకున్నారు. అతడి బైక్ టైర్లలోని గాలి తీసేశారు. ఆ తర్వాత ఆ యువతిని తమ బైక్ పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమెపై అత్యాచారం చేశారు. వీడియో కూడా తీసుకున్నారు. ఎవరికైనా చెబితో సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తామని బెదిరించారు. అయితే ఆ యువకుడు కాస్తా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ములుగు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని పర్యాటక ప్రాంతమయిన బ్లాక్ బెర్రీ ఐలాండ్ అటవీ ప్రాంతానికి సందర్శకులు విపరీతంగా వస్తుంటారు. ఈ క్రమంలోనే మార్చి 30వ తారీఖున ఓ యువకుడు తన స్నేహితురాలితో కలిసి ఆ అటవీ ప్రాంతానికి వెళ్లాడు. బైక్ పై అక్కడకు వచ్చిన ఆ జంటను చూసిన బొట్టాయిగూండెంకు చెందిన కోల సాత్విక్ అలియాస్ సైదులు, జనగామ ఆనందరావు దుర్మార్గమైన ఆలోచన చేశారు. ఆ యువకుడిని కొట్టారు. అతడి వద్ద నుంచి ఫోన్ ను లాగేసుకున్నారు. అతడి బైక్ లో గాలి తీసేశారు. ఆ తర్వాత ఆ యువతిని తమ బైక్ పై ఎక్కించుకుని మణుగూరుకు తీసుకెళ్లారు.
    ఇది కూడా చదవండి: ఈ రోజు రాత్రి నా భర్త ఒక్కడే ఇంట్లో ఉంటాడు.. వెళ్లి పని పూర్తి చెయ్.. అంటూ భార్యే అతడికి ఫోన్ చేసి మరీ..

    అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో యువతిని బెదిరించి భయపెట్టి సాత్విక్ అత్యాచారం చేశాడు. ఆనందరావు ఈ తతంగాన్ని వీడియో తీశాడు. యువతికి తీవ్రంగా రక్తస్రావం కావడంతో వాళ్లు భయపడిపోయారు. ఆమెను బైక్ పై స్వగ్రామంలో దించేశారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దనీ, చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. దీంతో ఆ యువతి ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది. కానీ యువితి స్నేహితుడు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని శనివారం నిందితులను అరెస్ట్ చేశారు. వారికి రిమాండ్ విధించారు.
    ఇది కూడా చదవండి: గర్భవతి అయినప్పటికీ భర్తతో శృంగారంలో పాల్గొన్న భార్య.. కడుపులో బిడ్డ ఎదుగుదలను చూసేందుకు స్కానింగ్ తీస్తే షాకింగ్ రిజల్ట్
    Published by:Hasaan Kandula
    First published: