హోమ్ /వార్తలు /క్రైమ్ /

Adilabad: కలకలం రేపిన కిడ్నాప్ ఉదంతం.. లిఫ్ట్ పేరుతో కారు ఎక్కి.. ఇదెక్కడి మోసం దేవుడా..

Adilabad: కలకలం రేపిన కిడ్నాప్ ఉదంతం.. లిఫ్ట్ పేరుతో కారు ఎక్కి.. ఇదెక్కడి మోసం దేవుడా..

బాధితుడు అనిల్ రెడ్డి

బాధితుడు అనిల్ రెడ్డి

లిఫ్ట్ కోసం కారును ఆపడం, అందులో కూర్చొని కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి తుపాకీ గురిపెట్టి తాము చెప్పిన చోటికి తీసుకువెళ్ళమనడం.. తర్వాత గుర్తు తెలియని ప్రదేశంలో ఆపి ఆ వ్యక్తి వద్ద ఉన్న నగదు, నగలు లాక్కొని మధ్యలో వదిలేసి పారిపోవడం… లేదంటే కిడ్నాప్‌కు పాల్పడటం.. ఇలాంటి ఘటనలు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం.

ఇంకా చదవండి ...

ఆదిలాబాద్: లిఫ్ట్ కోసం కారును ఆపడం, అందులో కూర్చొని కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి తుపాకీ గురిపెట్టి తాము చెప్పిన చోటికి తీసుకువెళ్ళమనడం.. తర్వాత గుర్తు తెలియని ప్రదేశంలో ఆపి ఆ వ్యక్తి వద్ద ఉన్న నగదు, నగలు లాక్కొని మధ్యలో వదిలేసి పారిపోవడం… లేదంటే కిడ్నాప్‌కు పాల్పడటం.. ఇలాంటి ఘటనలు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇలాగే.. సినీ ఫక్కీలో ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన కిడ్నాప్ ఉదంతం జిల్లాలో కలకలం రేపింది.

ఆదిలాబాద్ జిల్లాలో లిఫ్ట్ పేరుతో కారులో ఎక్కి కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలం రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద అదిలాబాద్ నుండి నిర్మల్ వైపు జాతీయ రహదారి పై ప్రయాణిస్తున్న అనిల్ రెడ్డి అనే వ్యక్తి కారును ఇద్దరు దుండగులు లిఫ్ట్ పేరుతో ఆపి అందులో ఎక్కారు. ఆ తరువాత కొద్దిదూరం వెళ్ళాక ఆ వ్యక్తి‌పై దాడి చేసి, తుపాకీని చూపించి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కారు, రూ.11 వేల డబ్బు.. అర తులం బంగారం దోచుకెళ్లారు. బాధితుడు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్‌లోని ఓ విద్యా సంస్థలో తన కూతురిని వదిలేసి తరువాత అదిలాబాద్ నుంచి నిర్మల్‌కు తిరుగు ప్రయాణం అయ్యాడు. అయితే ఈ క్రమంలోనే నేరెడిగోండ మండలంలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్ అడిగి వాహనంలో కూర్చున్నారు.


కొంత దూరం వెళ్లిన తరువాత ఆ ఇద్దరు వ్యక్తులు తనపై దాడి చేసి వారి వద్ద ఉన్న గన్‌ను చూపి బెదిరించి కళ్లకు గంతలు కట్టి నోటికి ప్లాస్టర్ పెట్టి కిడ్నాప్ చేసి తన వాహనంలోనే మహారాష్ట్రలోని పాండర్ కౌడ పట్టణం వరకు తీసుకువెళ్ళి అక్కడ కట్లతో ఉన్న తనను రోడ్డుపై పడేశారు. అనంతరం కారు, 11 వేల రూపాయల నగదు, అర తులం బంగారంతో ఉడాయించారని బాధితుడు చెప్పాడు. ఈ ఘటనపై బాధితుడు నేరడిగొండ పోలీస్ స్టేషన్‌లో చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే దుండగులను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

కట్ట లెనిన్, న్యూస్ 18 తెలుగు, ఆదిలాబాద్ జిల్లా

First published:

Tags: Adilabad, Kidnap, Robbery, Telangana crime news

ఉత్తమ కథలు