హోమ్ /వార్తలు /crime /

పుట్టింటి నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న భర్త వద్దకు బయలుదేరిన యువతి.. రైలు పట్టాలపై రెండు మృతదేహాలు.. అసలేం జరిగిందంటే..

పుట్టింటి నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న భర్త వద్దకు బయలుదేరిన యువతి.. రైలు పట్టాలపై రెండు మృతదేహాలు.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ యువతి, యువకుడు మంగళవారం తెల్లవారుజూమున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.

ఓ యువతి, యువకుడు మంగళవారం తెల్లవారుజూమున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనంతపురం జిల్లా (Ananthapuramu District) ధర్మవరంకు(Dharmavaram) చెందిన చెందిన లక్ష్మి వివాహం కొంతకాలం కిందట కర్నూలు జిల్లా దేవనకొండకు చెందిన సురేష్‌తో జరిగింది. ప్రస్తుతం దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈ నెల 24న లక్ష్మి ధర్మవరంలోని పుట్టింటికి వెళ్లింది. మూడు రోజులు తల్లి ఇంటివద్దే ఉంది. అయితే సోమవారం సాయంత్రం లక్ష్మిని ఆమె కుటుంబ సభ్యులు తిరిగి హైదరాబాద్‌కు (Hyderabad) వెళ్లే రైలు ఎక్కించారు. అయితే మంగళవారం తెల్లవారుజామున గద్వాల గద్వాల సమీపంలోని పిల్లిగుంట్ల వద్ద కాచిగూడ వైపునకు వెళ్తున్న బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ కింద పడి ఇద్దరు ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టుగా రైల్వే పోలీసులకు సమాచారం అందింది.

దీంతో రైల్వే పోలీసులు వెంటనే అక్కడి చేరుకన్నారు. అయితే అప్పటికే అక్కడ యువకుడు మరణించినట్టుగా గుర్తించారు. తీవ్ర గాయాలతో ఉన్న యువతిని ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో యువతి మరణించింది. దీంతో అధికారులు మృతుల వివరాలు ఆరా తీశారు. యువతిని ధర్మవరంకు చెందిన లక్ష్మిగా, యువకుడిని ధర్మవరంలోని కేతిరెడ్డి కాలనీకి చెందిన గంగన్న అలియాస్ గంగగా తేల్చారు.

Peddapalli: మేనబావను ప్రేమించిన యువతి.. కానీ అలా జరిగేసరికి తట్టుకోలేకపోయింది..

ఇక, లక్ష్మికి పెళ్లికి ముందే గంగన్నతో పరిచయం ఉందని అతని కుటుంబ సభ్యులు చెప్పారు. గంగన్న సోమవారం సాయంత్రం హడావుడిగా ఇంట్లో నుంచి బయలుదేరినట్టుగా వారు చెబుతున్నారు. అయితే అతడు లక్ష్మిని ఎందుకు కలిశాడో, ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో మాత్రం తెలియదని చెప్పారు. మరోవైపు తన భార్యతో పాటు ఆత్మహత్య చేసుకన్న వ్యక్తి గురించి తనకు తెలియదని లక్ష్మి భర్త తెలిపారు.

Honeymoon: పెళ్లి చేసుకుని హ్యాపీగా హనీమూన్‌కు వెళ్లారు.. అక్కడ అలా జరగడంతో మైండ్ బ్లాక్.. చివరకు..

ఇక, గంగన్న సెవెన్‌ హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌లో, లక్ష్మి యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించినట్లు టికెట్లు ఉన్నట్టుగా చెబుతున్నారుఇదిలా ఉంటే.. గంగన్న గద్వాలకు వచ్చి లక్ష్మిని కలుసుకున్నాడు. అనంతరం ఇద్దరూ కలిసి బెంగళూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి మృతిచెందారు. అయితే వీరి ఆత్మహత్యకు కారణమేంటి అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. రైల్వే పోలీసులు మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇరువురు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ వివరించారు.

First published:

Tags: Crime news, Suicide

ఉత్తమ కథలు