Mumbai Bridge collapse: ఐదుకు చేరిన మృతుల సంఖ్య

ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

news18-telugu
Updated: March 14, 2019, 10:05 PM IST
Mumbai Bridge collapse: ఐదుకు చేరిన మృతుల సంఖ్య
కూలిపోయిన ఫుట్‌ఓవర్ బ్రిడ్జి అడుగుభాగం
  • Share this:
ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరో 23 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో..మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.

ఛత్రపతి శివాజీ టెర్మినల్ ‌లోని ఉత్తర భాగం, టైమ్స్ ఆఫ్ ఇండియా భవనానికి సమీపంలో ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జి అడుగుభాగం కూలిపోయి రోడ్డుపై పడింది. సాయంత్రం రద్దీ సమయంలో కూలడంతో వాహనాలపై శిథిలాలు విరిగిపడ్డాయి. ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading