Visakhapatnam: విశాఖలో లారీ బీభత్సం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..

విశాఖపట్నంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం హనుమంతవాక జంక్షన్ వద్ద లారీ అదుపుతప్పి బీభత్సవం సృష్టించింది.

news18-telugu
Updated: October 11, 2020, 12:34 PM IST
Visakhapatnam: విశాఖలో లారీ బీభత్సం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విశాఖపట్నంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  హనుమంతవాక జంక్షన్ వద్ద లారీ అదుపుతప్పి బీభత్సవం సృష్టించింది. ఇతర వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. వివరాలు.. రద్దీగా ఉండే హనుమంతవాక జంక్షన్‌లో మధురవాడ వైపు వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో లారీ అదుపుతప్పి ఎదురుగా ట్రాఫిక్‌ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను ఢీ కొట్టింది. ఈ క్రమంలోనే ఓ బైక్‌ను కూడా లారీ ఢీ కొట్టడంతో.. దానిపై ఉన్న ఇద్దరు ఘటన స్థలంలోనే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడటంతో వారిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అయితే ఈ ఘటనలో మృతిచెందినవారి వివరాలు తెలియాల్సి ఉంది. ఆదివారం కావడంతో రోడ్లపై రద్దీ కొంతవరకు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. ఇతర రోజుల్లో ఈ ప్రమాదం జరిగి ఉంటే తీవ్రత ఎక్కువగా ఉండేదన్నారు.
Published by: Sumanth Kanukula
First published: October 11, 2020, 12:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading