హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime : శ్రద్ధా వాకర్ హత్య తరహాలో మరో రెండు ఘటనలు .. శరీరాల్ని ముక్కలుగా చేసి...

Crime : శ్రద్ధా వాకర్ హత్య తరహాలో మరో రెండు ఘటనలు .. శరీరాల్ని ముక్కలుగా చేసి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crime News : ఇండియాలో క్రైమ్ కొత్తపుంతలు తొక్కుతోంది. హత్యలు చేసేవారు అతి కిరాతకంగా చేస్తున్నారు. శ్రద్ధావాకర్ హత్య తరహాలోనే మరో రెండు ఘటనలు జరిగాయి. అవి కూడా సంచలనం అవుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మనుషుల ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. రకరకాల కారణాలతో ఎంతో మంచివారు సైతం మృగాలవుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో శ్రద్ధా వాకర్ (Shraddha Walker) హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా.. తాజాగా అలాంటివే మరో రెండు ఘటనలు వెలుగుచూశాయి. మొదటి ఘటనలో.. మాజీ ప్రియుడు.. మాజీ ప్రియురాలిని హత్య చెయ్యగా.. మరో కేసులో కొడుకు తండ్రిని చంపేశాడు.

మొదటి కేసు:

ఉత్తరప్రదేశ్ .. అజంఘర్ జిల్లాలో ఇది జరిగింది. నవంబర్ 15న స్థానికులు.. పశ్చిమి గ్రామ శివారులోని ఓ బావిలో మహిళ మృతదేహ భాగాలను చూశారు. ఆమెను ఆరాధన అని గుర్తించారు. అర్ధనగ్నంగా ఉన్న ఆ మృతదేహ భాగాలను చూసి.. రెండు మూడు రోజుల కిందట హత్య జరిగి ఉంటుందని అంచనా వేశారు. దీనిపై పోలీసులు ఆరా తియ్యగా.. నిందితుడు ప్రిన్స్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. ప్రిన్స్ యాదవ్, ఆరాధన ప్రేమించుకున్నారు. కానీ ఆమె ఈ సంవత్సరం వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దాంతో రగిలిపోయిన ప్రిన్స్ యాదవ్.. ఆమెను చంపేయాలని ప్లాన్ వేశాడు. ఇందుకు అతని తల్లిదండ్రులు, కజిన్ సర్వేష్ కూడా సహకరించినట్లు తెలిసింది.

దర్యాప్తులో తెలిసిన సమాచారం ప్రకారం.. నవంబర్ 9న మంచిగా నటిస్తూ ఆరాధనను తన బైక్‌పై ఓ ఆలయానికి తీసుకెళ్లాడు ప్రిన్స్ యాదవ్. అక్కడ ఎవరూ లేని ప్రాంతంలో సర్వేష్ సాయంతో.. చెరకు తోట మధ్యలో ఆరాధనను గొంతు నొక్కి చంపేశాడు. తర్వాత ఇద్దరూ కలిసి.. ఆమె మృతదేహాన్ని ఆరు భాగాలుగా నరికేశారు. పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేసి.. బావిలో పడేశారు. తలను మాత్రం.. దగ్గర్లోని ఓ చెరువులో విసిరేశాడు సర్వేష్. శనివారం యాదవ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. సర్వేష్, యాదవ్ కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు.

రెండో కేసు:

ఇది పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. 55 ఏళ్ల మాజీ నేవీ ఉద్యోగి ఉజ్వల్ చక్రవర్తిని కొడుకే చంపేశాడు. దక్షిణ 24 పరగణాల జిల్లా.. బారూయీపుర్‌లో ఈ ఘటన జరిగింది. అసలేమైందంటే.. తన తండ్రి కనిపించట్లేదని కొడుకు నవంబర్ 15న పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దర్యాప్తు చేసిన పోలీసులకు కుటుంబ సభ్యులపైనే అనుమానం వచ్చింది. తల్లీ, కొడుకూ చెప్పిన మాటలు తేడాగా ఉండటంతో.. పోలీసుల పని తేలికైంది.

ఉజ్వల్ చక్రవర్తి 12 ఏళ్ల కిందట రిటైర్ అయ్యారు. తాజాగా కాలేజీలో చదువుతున్న కొడుకు.. నవంబర్ 12న ఎగ్జామ్ ఫీజు కోసం రూ.3 వేలు ఇవ్వమని అడిగాడు. తండ్రి ఇవ్వలేదు. ఇద్దరి మధ్యా పెద్ద గొడవ జరిగింది. పెద్దాయన కోపంతో కొడుకును కొట్టాడు. దాంతో కొడుకు.. తండ్రిని నెట్టగా.. ఆయన తల కుర్చీకి తగిలి.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అప్పటికీ ఆవేశం చల్లార్చుకోని కొడుకు.. తండ్రిని గొంతు నొక్కి చంపేశాడు. ఇందుకు తల్లి కూడా సహకరించింది. ఇద్దరూ కలిసి.. డెడ్ బాడీని బాత్‌రూంలోకి తీసుకెళ్లి.. రంపంతో కోసి.. 6 ముక్కలు చేశారు. వాటిని ఓ సంచిలో వేసి.. వేర్వేరు ప్రాంతాల్లో పారేశాడు. వాటిలో కొన్నింటిని సేకరించిన పోలీసులు.. తల్లి, కొడుకును అరెస్టు చేశారు.

తెలంగాణలో దారుణం.. ప్రసవం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన డాక్టర్.. శిశువు మృతి

ఢిల్లీలోనూ ఇలాగే జరిగింది. లివ్ ఇన్ పార్ట్‌నర్‌గా ఉన్న కాల్ సెంటర్ ఉద్యోగిని శ్రద్ధా వాకర్‌ను గొంతు పిసికి చంపి.. 35 ముక్కలు చేశాడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా. ఆ ముక్కలను ఫ్రిజ్‌లో ఉంచి.. ఢిల్లీ శివార్లలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఢిల్లీకి దగ్గర్లోని అడవిలో పడేసిన మాంసపు ముక్కలతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆఫ్తాబ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. దర్యాప్తు కొనసాగుతోంది.

First published:

Tags: Crime news, Murder case, Shradda kapoor, Uttar pradesh, West Bengal

ఉత్తమ కథలు