యూపీలో అరాచకం.. రేప్ కుదరలేదని వేడి కత్తితో బాధితురాలి కళ్లలో..

ప్రతీకాత్మక చిత్రం

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై దారుణమైన హేయమైన చర్యలకు పాల్పడుతున్నారు దుర్మార్గులు. తాజా ఘటన స్థానికులను షాకయ్యేలా చేసింది. అసలేం జరిగింది?

 • Share this:
  Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో మరో అరాచక ఘటన జరిగింది. రిపోర్టుల ప్రకారం... లలిత్ పూర్ జిల్లాకు చెందన ఓ మహళను ఇద్దరు దుండగులు రేప్ చెయ్యబోయారు. అది వాళ్లకు కుదరలేదు. దాంతో... ప్రతీకారంగా... వేడి వేడి కత్తితో ఆమె కళ్లలో పొడిచారు. ఇది చదువుతుంటే... మనకే "బాబోయ్.. ఏంటీ అరాచకం... ఇంత దారుణమా" అనిపిస్తోంది కదూ... మరి ఆ బాధితురాలి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఊహించుకోండి. ఆమె కళ్ల ముందే... ఆమె కళ్లు... ఇంతకంటే పాశవిక చర్య ఉంటుందా...

  రిపోర్టుల ప్రకారం ఈ ఘటన జులై 21న ధమ్నా గ్రామంలో జరిగింది. బాధితురాలు కూరగాయల వ్యాపారం చేస్తోంది. సాయంత్రం చీకటి పడే సమయంలో... దుకాణం సర్దేసి... ఇంటికి వెళ్తుండగా ఈ దారుణం జరిగింది.

  ప్రస్తుతం ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్న ఆమె... పోలీసులకు వాంగ్మూలం (statement) ఇచ్చింది. ఆమె ఇంటికి వెళ్తుంటే... ఆ ఇద్దరూ వెనకాలే వచ్చి ఆమెను పట్టుకోబోయారు. అప్పటికే అలర్ట్ అయిన ఆమె... చెప్పులు తీసి... ఇద్దర్నీ చితకబాదేందుకు ప్రయత్నించింది. ఆమెతో చెప్పు దెబ్బలు తిన్న ఆ ఇద్దరూ.... తమకు ఘోర అవమానం జరిగిపోయినట్లు ఫీలైపోయారు. మమ్మల్నే చెప్పుతో కొడతావా... నీకు ఇంత ఇదా... అంటూ ఇద్దరూ ఆమెను బలంగా పట్టుకొని... తమ దగ్గరున్న సిగరెట్ లైటర్‌తో కత్తిని వేడి చేసి... ఆమె రెండు కళ్లలో పొడిచారు. ఆమె ఎంతగా బతిమలాడినా వాళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.

  ఈ ఘటన తర్వాత... దూరంగా పోలీస్ వాహనం సైరన్ వినిపించింది. దాంతో ఆమెను అక్కడ వదిలేసి పారిపోయారు. కానీ ఇది పోలీసులకు తెలియదు కదా... వాళ్లు... పెట్రోలింగ్ వాహనంలో... అలా రోడ్డుపై వచ్చి... రోడ్డుపై నుంచే వెళ్లిపోయారు. ఆమె అక్కడే కూలబడింది. మర్నాడు ఉదయం... ఆమె కోసం వెతుకుతూ.. ఆమె వదిన అటుగా వచ్చి... ఆ పరిస్థితుల్లో సొమ్మ సిల్లి పడివున్న ఆమెను చూసి షాకైంది. వెంటనే పోలీసులకు చెప్పింది. పోలీసులు వెంటనే అంబులెన్స్‌కి కాల్ చేశారు. అధికారులు కూడా పరుగున వచ్చారు. అలా అందరూ కలిసి ఆమెను ఆస్పత్రికి తరలించారు.

  ఇది కూడా చదవండి: Video: బస్ పైకి ఎక్కిన ప్రయాణికులు.. కొంత దూరం వెళ్లాక షాక్

  బాధితురాలి వదిన చెప్పిన దాని ప్రకారం... ఆ ఇద్దరూ... స్థానికులే. తరచూ నేరాలు చేస్తూ ఉంటారట. మూడు నెలల కిందట కూడా వాళ్లు ఇదే బాధితురాలిని రేప్ చెయ్యాలని కుట్ర పన్నారని, లైంగికంగా వేధించారని ఆమె చెప్పింది. మరి అప్పట్లో పోలీసులకు చెప్పలేదా... అంటే... అధికారులకు చెప్పినా ఏ చర్యలూ తీసుకోలేదని ఆమె వివరించింది. దీనిపై లలిత్ పూర్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గిర్జేష్ కుమార్ స్పందించారు. ఇంతకు ముందు కంప్లైంట్ ఇచ్చినప్పుడు... ఆ ఇద్దరూ... బూతులు తిట్టారని కంప్లైంట్ ఇచ్చారనీ... అందువల్ల దాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదనీ... ఇప్పుడు మాత్రం ఇద్దరిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఆమె వదిన ఇప్పుడు చెబుతున్నదొకటి... అప్పుడు చెప్పింది మరొకటి అని అన్నారు.

  ఇది కూడా చదవండి: Gympie: శపించే మొక్క!... ఆకుల్ని ముట్టుకుంటే చనిపోతారా?

  ఏది ఏమైతేనేం... ఓ మహిళ కళ్లు ఉన్నాయో, పోయాయో తెలియని పరిస్థితి ఉంది. ఇంత స్వేచ్ఛగా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. చట్టం, లా అండ్ ఆర్డర్ వేటిపైనా భయం లేదు. ఇలా తయారైంది సొసైటీ.
  Published by:Krishna Kumar N
  First published: