కాకినాడలో 4 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసి..

గాలిపటాలు ఎగరేద్దామని చెప్పి ఇద్దరు బాలురు ఆ చిన్నారిని మేడపైకి తీసుకెళ్లారు. అనంతరం అభంశుభం తెలియని ఆ పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రేప్ చేసిన తర్వాత తిరిగి ఇంటి వద్ద వదలిపెట్టి వెళ్లిపోయారు.


Updated: January 17, 2020, 6:57 PM IST
కాకినాడలో 4 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కాకినాడ: దిశాలాంటి కఠిన చట్టం తీసుకొచ్చినా అత్యాచారాలు ఆగడం లేదు. 21 రోజుల్లోనే మరణశిక్ష విధిస్తామంటున్నా కామాంధులు భయపడడం లేదు. అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కాకినాడలో ఘోరం జరిగింది. 4 ఏళ్ల పసిపాపపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు. రేచర్లపేట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాలిపటాలు ఎగరేద్దామని చెప్పి ఇద్దరు బాలురు ఆ చిన్నారిని మేడపైకి తీసుకెళ్లారు. అనంతరం అభంశుభం తెలియని ఆ పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రేప్ చేసిన తర్వాత తిరిగి ఇంటి వద్ద వదలిపెట్టి వెళ్లిపోయారు.

చిన్నారికి స్నానం చేయిస్తున్న సమయంలో గాయాలు కనిపించడంతో.. ఏమైందని తల్లి ఆరా తీసింది. దాంతో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది బాలిక. ఘటనపై బాధితురాలి తల్లి కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఐతే నిందితులిద్దరు మైనర్లని పోలీసులు తెలిపారు. ఒకరి వయసు 14 ఏళ్లు కాగా.. మరొకరి వయసు 8 ఏళ్లని వెల్లడించారు. సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసి ఆ ప్రభావంతో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
First published: January 17, 2020, 6:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading