కన్న తల్లిని కడతేర్చిన ఇద్దరు మైనర్లు

లోకంలో మానవ సంబంధాలు, ప్రేమనురాగాలు రానురాను దెబ్బతింటున్నాయి. క్షణికావేశంలో కొందరు వ్యక్తులు.. తమ సొంతవాళ్లనే కడతేరుస్తున్నారు.

news18-telugu
Updated: September 18, 2020, 3:11 PM IST
కన్న తల్లిని కడతేర్చిన ఇద్దరు మైనర్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లోకంలో మానవ సంబంధాలు, ప్రేమనురాగాలు రానురాను దెబ్బతింటున్నాయి. క్షణికావేశంలో కొందరు వ్యక్తులు.. తమ సొంతవాళ్లనే కడతేరుస్తున్నారు. తాజాగా నవమాసాలు మోసి కని పెంచిన మమకారాన్ని, మానవత్వాన్ని మరచి.. ఇద్దరు మైనర్లు అతిదారుణంగా హతమార్చారు. ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని సుందర్‌పాడ ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది. ఓ విషయంలో తల్లితో మాట మాట పెరగడంతో వారిద్దరు ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి భువనేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఉమాశంకర్ దాస్ మాట్లాడుతూ.. "40 ఏళ్ల మహిళను ఆమె ఇద్దరు కొడుకులు హత్య చేశారు. ఓ విషయంలో వాగ్వాదం తల్లికి, ఇద్దరు కొడుకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారు ఇనుప రాడ్డుతో ఆమెపై దాడి చేశారు. దీంతో అమె అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు వెళ్లే సరికి ఆమె మృతదేహాం రక్తపు మడుగులో పడి ఉంది. ఈ కేసులో నిందితులుగా ఆమె ఇద్దరు కొడుకులను అరెస్ట్ చేశాం" అని తెలిపాయి.
Published by: Sumanth Kanukula
First published: September 18, 2020, 3:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading