హోమ్ /వార్తలు /క్రైమ్ /

అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్.. పురుగులమందు తాగించి చంపేశారు.. పాము కరిచిందన్న తల్లి.. ఎందుకలా చెప్పింది

అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్.. పురుగులమందు తాగించి చంపేశారు.. పాము కరిచిందన్న తల్లి.. ఎందుకలా చెప్పింది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమ్మాయి పరిస్థిితిని చూసి డాక్టర్లకు అనుమానం వచ్చింది. పాము కరిచిన ఆనవాళ్లు లేవు. ఒంట్లో పురుగుల మందు అవశేషాలు ఉన్నాయి. ఏదో జరిగిందని.. తల్లిపై డాక్టర్లు ప్రశ్నల వర్షం కురిపించారు.

మన దేశంలో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. కోర్టులు కఠిన శిక్షలు విధిస్తున్నా... పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఒక్కడో ఓ చోట అత్యాచార ఘటన వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా హరియాణాలో ఘోరం జరిగింది. ఇద్దరు మైనర్ బాలికలను నలుగురు వ్యక్తులు రేప్ చేశారు. తల్లిని కొట్టి.. ఆమె కళ్ల ఎదుటే అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం పురుగుల మందును తాగించారు. సోనిపత్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరా ప్రకారం.. ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి చిన్న ఇంట్లో నివసిస్తోంది. ఒక కూతురి వయసు 14, మరో కుమార్తె వయసు 16 ఏళ్లు. తల్లి కూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఐతే వీరి పక్క ఇంట్లోనే కొందరు వలస కార్మికులు నివసిస్తున్నారు.

ఆగస్టు 6న పక్క ఇంట్లో ఉండే నలుగురు వ్యక్తులు ఆమె ఇంట్లో చొరబడ్డారు. వారి వయసు 22 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుంది. రాత్రివేళ ఇంటి లోపలికి చొరబడి గడియవేశారు. తల్లిపై దాడి చేసి.. కూతుళ్లపై అత్యాచారం చేశారు. రాత్రంతా వారికి నరకం చూపించారు. అంతటితో ఆగకుండా ఇంట్లలో ఉన్న పురుగుల మందును తీసుకొని.. వారితో బలవంతంగా తాగించారు. అనంతరం కాసేపటికే అక్కాచెల్లెళ్లు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇక్కడ జరిగిన దాని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని తల్లిని హెచ్చరించారు దుండగులు. ఎవరైనా అడిగితే పాము కరిచిందని చెప్పమన్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కూతుళ్ల ఆరోగ్యం క్షీణించడంతో వారిని ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఏం జరిగిందని డాక్టర్లు అడిగితే పాము కరిచిందని చెప్పారు. అప్పటికే ఓ కూతురు మరణించింది. మరో కూతురు చికిత్స పొందుతూ కన్నుమూసింది.

వారి పరిస్థితిని చూసి డాక్టర్లకు అనుమానం వచ్చింది. పాము కరిచిన ఆనవాళ్లు లేవు. ఒంట్లో పురుగుల మందు అవశేషాలు ఉన్నాయి. ఏదో జరిగిందని.. తల్లిపై డాక్టర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. చివరకు జరిగిన విషయాన్ని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది ఆ మహిళ. అనంతరం డాక్టర్ల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గురుగ్రామ్‌లో కూడా 17 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. ఈ క్రమంలోనే తమ కూతురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

భార్యకు వరుస అబార్షన్‌లు..తాంత్రికుడు చెప్పాడని బాలికను చంపి..కళ్లు పీకేసి క్షుద్రపూజలు

పెళ్లైనా ప్రియుడిని మర్చిపోలేదు.. చూడాలని ఉందంటూ ఫోన్‌ చేసింది.. అతడు వచ్చాడు.. చంపేశాడు

First published:

Tags: Crime, Crime news, Haryana

ఉత్తమ కథలు